ఇటీవల బిగ్ బాస్ తెలుగు బ్యూటీ సిరి హన్మంతు తన ప్రియుడు శ్రీహాన్ తో కలిసి వరలక్ష్మీ వ్రతం పూజలు నిర్వహించింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. చాలా మంది ఈ ఫొటోలను చూసి పాజిటివ్ కామెంట్స్ చేశారు. జంట బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇదే క్రమంలో కొందరు నెటిజన్లు మాత్రం ‘పెళ్లి కాకుండానే ఇలాంటి పనులేంటి? అంటూ సిరి, శ్రీహాన్ లపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు మరో బిగ్ బాస్ బ్యూటీ కూడా ఇదే తరహా విమర్శలు ఎదుర్కొంటోంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7 తో అందరి దృష్టిని ఆకర్షించింది ప్రియాంక జైన్. విజేతగా నిలవకపోయినా తన ఆట, మాటతీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేస్తోందీ అందాల తార. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన ప్రియుడు శివ కుమార్ తో కలిసి వీడియోలు, రీల్స్ చేస్తోంది. అయితే కొన్ని సార్లు వీరు చేసిన వీడియోలు ట్రోలింగ్ కు గురువుతున్నాయి. ఆ మధ్యన తిరుమల లో పులి వచ్చిందంటూ ప్రాంక్ చేసి విమర్శల పాలయ్యారు ప్రియాంక- శివ కుమార్. దీంతో క్షమాఫణలు కూడా చెప్పాల్సి వచ్చింది.
తాజాగా మరోసారి ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నారు ప్రియాంక జైన్- శివ కుమార్. అందుకు కారణం వీరు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలే. ఈ జంట శ్రావణ మాస పూజలో పాల్గొంది. వరలక్ష్మీ అమ్మవారికి శ్రావణ శుక్రవారం పూజలు చేశారు. ఈ పూజల్లో ప్రియాంక జైన్ మదర్ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇది చూసిన చాలా మంది చూడముచ్చటైన జంట అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అదే క్రమంలో మరికొందరు పెళ్లి కాకుండానే ఇలాంటి పూజలేంటి? అంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వరలక్ష్మీ వ్రతం పూజల్లో ప్రియాంక- శివ కుమార్..
త్వరలోనే ఏడడుగులు..
కాగా ప్రియాంక- శివ కుమార్ ఈ ఏడాదిలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ప్రియుడికి ప్రపోజల్ చేసిన విషయాన్ని ఇటీవల సోషల్ మీడియాలో పంచుకుంది ప్రియాంక. ప్రియుడి బర్త్ డే సందర్భంగా మోకాళ్లపై నిలబడి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగింది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి.