మన కళ్ల ఆరోగ్యం బాగా ఉండాలంటే.. వాటికి కావాల్సిన పోషకాలతో నిండిన ఆహారాన్ని రోజూ తినడం చాలా అవసరం. ప్రతి రోజూ సరైన ఆహార పదార్థాలను తీసుకుంటే.. కళ్లకు అవసరమైన శక్తి లభిస్తుంది. ఇప్పుడు కంటి ఆరోగ్యాన్ని కాపాడే ముఖ్యమైన ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.
క్యారెట్
క్యారెట్ లో ఎక్కువగా ఉండే బీటా కెరోటిన్ విటమిన్ A, చూపు శక్తిని మెరుగుపరుస్తాయి. ఇవి కంటి తడిని నిలబెట్టడంలో సాయపడతాయి. కనుక వారానికి కనీసం 3 నుంచి 4సార్లు క్యారెట్ తింటే మంచి ఫలితాలు చూడవచ్చు.
పాలకూర
ఈ ఆకుకూరలో విటమిన్ A, Cతో పాటు ల్యూటిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కళ్లను వాపుల నుంచి కాపాడుతుంది. పాలకూరను ఉడకబెట్టినా, పప్పుల్లో కలిపినా.. దాని గుణాలు శరీరానికి లభిస్తాయి.
టమాటా
టమాటాలో ఉండే లైకోపీన్ అనే పదార్థం కంటి కణాలను హానికరమైన రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. టమాటా పచ్చిగా లేదా వంటల్లో ఉపయోగించడం ద్వారా దీనిలోని గుణాలు కళ్లకు మేలు చేస్తాయి.
చిలగడదుంపలు
విటమిన్ A ఎక్కువగా ఉండే ఈ దుంపలు రాత్రిపూట చూపు బలాన్ని పెంచుతాయి. కొంతమందిలో ఉండే రాత్రి దృష్టి సమస్యలకు ఇది సాయపడుతుంది. ఉడకబెట్టి లేదా స్టీమ్ చేసి తినవచ్చు.
ఉసిరికాయ
ఈ పండు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్ Cను ఇస్తుంది. ఉసిరికాయ రసాన్ని ఉదయం తీసుకుంటే కంటి కణాలు పెరిగే విధానం మెరుగవుతుంది.
బొప్పాయి
బీటా కెరోటిన్, విటమిన్ C, Eతో పాటు చాలా రకాల యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. ఇది కళ్లకు వెలుతురు సహించని సమస్యను తగ్గిస్తుంది. పండుగా తినడమే కాకుండా జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
వాల్‌నట్స్
ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఈ గింజలు కంటి కణాలకు తడిని అందిస్తూ.. మాక్యులార్ డిజెనరేషన్ లాంటి సమస్యలను రాకుండా ఆపగలవు.
నారింజ
విటమిన్ Cతో నిండిన నారింజ పండ్లు కంటి చూపును మెరుగుపరచడంలో సాయపడతాయి. కంటి లోపల వాపులను తగ్గించడంలో సాయపడతాయి.
గుడ్లు
గుడ్లలో ఉండే ల్యూటిన్ జింక్ కంటి మధ్య భాగంలోని కణాలను రక్షిస్తూ వృద్ధాప్య ప్రభావాన్ని తగ్గిస్తాయి. రోజుకు ఒక గుడ్డు తినడం ద్వారా మంచి లాభం ఉంటుంది.
బాదం
బాదంలో విటమిన్ E శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చూపు బలాన్ని మెరుగుపరచడంలో సాయపడతాయి. రోజూ 5 నుంచి 7 బాదం తినడం చాలు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)