ఈ పద్ధతికి అదనపు నూనె లేదా కొవ్వు అవసరం లేదని, ఇది ఆరోగ్యకరమైన ఎంపిక అని నిపుణులు అంటున్నారు. కొన్ని ఆహారాలను నీటిలో త్వరగా ఉడికించవచ్చు. పెద్ద మొత్తంలో ఆహారాన్ని మండటానికి అనుకూలంగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ ఏ,బి విటమిన్లు ఇంకొన్ని ఖనిజాలు వంట నీటిలో కరిగిపోతాయి. వంట నీటిని పారబోసినట్లయితే ఈ పోషకాలను కోల్పోతాం. కానీ సూప్‌లు, పాస్తా, అన్నం, పప్పులు, ఉడికించిన గుడ్లు వంటి వంటకా లకు నీటిలో ఉడికించడం తప్పనిసరి. ప్రతి వంట పద్ధతికి దానిదైన ప్రయోజనాలు ఉంటాయని వండే ఆహారాన్ని బట్టి సరైన పద్ధతిని ఎంచుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. బరువు తగ్గాలనుకున్నా, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్నా, లేదా మెరుగైన చర్మం కావాలనుకున్నా ఆవిరితో ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు. అంతేకాకుండా ఆవిరి మీద ఉడికించడం వల్ల కూరగాయలు సహజ రుచిని మెరుగుపడుతుంది. నిపుణుల సూచనల ప్రకారమే మీ అవగాహన కోసం మాత్రమే మీకు ఈ సమాచారం అందించాం. ఆరోగ్య సమస్యలు ఉన్న వీటిని పాటించే ముందు వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.