రాఖీపండగను పురస్కరించుకుని పోస్టల్ డిపార్టుమెంట్ ప్రత్యేక పోస్టల్ కవర్ అందుబాటులోకి వచ్చింది. ఈ పోస్టల్ కవర్ సాయంతో మనదేశంతో పాటుగా విదేశాలకు కూడా రాఖీలను స్పీడ్ పోస్టుల ద్వారా పంపే అవకాశం కల్పిస్తోంది. కవర్ మీద ఉన్న చిరునామాకు ప్రత్యేకంగా బట్వాడా చేసేందుకు తపాలా శాఖ ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఈ ఏడాది రాఖీపండుగ ఆగస్ట్ 9వ తేదీన జరుపుకోనున్నారు.

*ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలు గుర్తించుకోవాల్సిన రూల్స్ ఇవే..
రాఖీ పండుగకు మీ సోదరికి ఇలాంటి గిఫ్ట్ ట్రై చేయండి..
మరోవైపు రాఖీ పండుగ సందర్భంగా సోదరుడి యోగక్షేమాలను కాంక్షిస్తూ అక్కా చెల్లెళ్లు రాఖీలు కట్టడం.. తోడబుట్టిన దాని సంతోషం కోసం సోదరుడు కానుకలు సమర్పించడం తెలిసిందే. అయితే ఈసారి రాఖీ పండగ కి మీ సోదరికి ఆర్థిక భరోసా అందించే ఇలాంటి బహుమతులు ట్రై చేయండి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది సిప్. రాఖీ పండగ నాటి నుంచే ఆమె పేరు మీద పెట్టుబడిని ప్రారంభిస్తే.. భవిష్యత్తులో ఆమె ఆర్థిక అవసరాలకు ఉపయోగపడుతుంది. అలాగే మహిళల కోసం తెచ్చిన ప్రత్యేక పథకం మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్‌లో మీ సోదరి పేరు మీద సేవింగ్స్ ప్రారంభించవచ్చు. వీటిలో సాధారణ సేవింగ్స్ అకౌంట్లతో పోలిస్తే మెరుగైన వడ్డీ లభిస్తుంది. అలాగే స్టాక్స్ కూడా బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేయవచ్చు.
*వారందరికీ భారీ శుభవార్త.. గౌరవ వేతనాలు పెంపు.. ఒకేసారి రెట్టింపు..
ఇక మహిళలకు అన్నింటి కంటే ఇష్టమైనది ఏమిటంటే ఠక్కున గుర్తొచ్చేది బంగారమే. కావున రాఖీ పండుగ సందర్భంగా మీ అక్కకు, లేదా చెల్లెమ్మకు బంగారు నాణేలు, లేదా వెండి నాణెలు బహుమతిగా ఇవ్వచ్చు. ఇవి శాశ్వతంగా నిలిచి ఉండటమే కాకుండా.. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తినప్పుడు వారికి ఉపయోగపడతాయి. అలాగే డిజిటల్ రూపంలో బంగారం కొనివ్వడం కూడా ఉత్తమం. ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్లు, టర్మ్ ఇన్సూరెన్స్ వంటి పాలసీలు కొనివ్వడం కూడా మంచి ఆలోచన అని నిపుణులు చెప్తున్నారు. తాత్కాలిక బహుమతులు కాకుండా దీర్ఘకాలంలో ఉపయోగపడేలా ఇలాంటివి ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తున్నారు.