ఏపీని మరోసారి వరుణుడు పలకరించనున్నాడు. వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడు రోజుల పాటు పల్నాడు, రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఫ్రఖర్ జైన్ వెల్లడించారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

*పైకి నవ్వుతూ కనిపించే హెచ్ఆర్ ఉద్యోగం.. లోపల మాత్రం.. భర్తే అనుకుంటే, మామ కూడానా?
మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం రోజు అనంతపురం జిల్లా, శ్రీసత్యసాయి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా ,అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు జిల్లా, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాలలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన భారీ వాహనాలు
*ఏపీలోని ఎస్సీ, ఎస్టీ యువతకు తీపికబురు.. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ.!
మంగళవారం రోజున పల్నాడు జిల్లా , ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా , అల్లూరి జిల్లా, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
బుధవారం రోజున అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా, వైఎస్సార్ కడప జిల్లా, పల్నాడు, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మరోవైపు భారీ వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాలలో ఉండవద్దని.. పాతబడిన భవనాలు, చెట్ల కింద నిల్చోవద్దని సూచించింది. అలాగే ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, కల్వర్టుల సమీపంలో ఉండవద్దని సూచించింది.