ఏం కొన్నాలన్నా.. తిన్నాలన్నా.. ఏం చేయాలన్న కావాల్సింది డబ్బు. డబ్బు సంపాదించడానికి మనిషి రాత్రి, పగలు అనే తేడా లేకుండా కష్టపడుతున్నాడు. కానీ చాలా మంది ఎంత పని చేసినా..వారి చేతుల్లో రూపాయి కూడా ఉండదని అంటుంటారు. డబ్బు ఉండకపోవడానికి మన అలవాట్లు కూడా కారణం కావచ్చు. అవును..చాణక్యుడు తన నీతి శాస్త్రంలో దీని గురించి ప్రస్తావించాడు..? అవేంటో ఈ స్టోరీ తెలుసుకుందాం..
ఈ అలవాట్లే ఆర్థిక నష్టానికి కారణం:
సోమరితనం:
సోమరితనం మనిషికి అతిపెద్ద శత్రువు అని చాణక్యుడు చెప్పాడు. పనిని వాయిదా వేయడం, అవకాశాలను కోల్పోవడం, సమయానికి నిర్ణయాలు తీసుకోకపోవడం ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి సోమరితనాన్ని వదిలివేయాలి.
అధిక ఖర్చు:
చాణక్యుడి ప్రకారం.. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసే వారి చేతుల్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండదు. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ అప్పుల్లో ఉంటారు. అందుకే ఏదైనా ఖర్చు చేసే ముందు 10 సార్లు ఆలోచించాలి. చాణక్యుడు కూడా ఒక వ్యక్తి తన ఆదాయానికి మించి ఎప్పుడూ ఖర్చు చేయకూడదని, ముఖ్యంగా అప్పు తీసుకోకూడదని చెబుతాడు.
చెడు అలవాట్లు:
ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు ఉన్నవారిలో డబ్బు మిగలదు. అవును.. వారు డబ్బు ఆదా చేయరు. బదులుగా వారి సంపాదనను వారి అలవాట్ల కోసం ఖర్చు చేస్తారు. అందువల్ల ఒక వ్యక్తి వీలైనంత వరకు అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు.
బాధ్యతారాహిత్యం:
ఇంటి బాధ్యత తీసుకోని వారు అనవసరంగా ఖర్చు చేస్తారు. వారి చేతుల్లో డబ్బు ఉండదు. కానీ మనం బాధ్యత తీసుకుంటే.. పొదుపు, పెట్టుబడి పెట్టే అలవాటును మనం అభివృద్ధి చేసుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉండాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..