Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Kaleshwaram Project: కాళేశ్వరం డ్యామేజ్‌కి బాధ్యులు వాళ్లే.. తేల్చేసిన కమిషన్.. కేబినెట్ భేటీపై ఉత్కంఠ..

4 August 2025

Tollywood: పాక్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ హీరో! ఫిల్మ్ వర్కర్స్ అసోసియేషన్ హెచ్చరిక

4 August 2025

IND vs ENG: రోహిత్, కోహ్లీల రీఎంట్రీ షురూ.. ఇంగ్లండ్ తర్వాత టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే..

4 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Darshan 7 Dwarams Srivari Temple,తిరుమల గర్భగుడికి 7 ద్వారాలు.. వారికి మాత్రమే శ్రీవారిని చాలా దగ్గరగా దర్శించుకునే అవకాశం! – significance of tirumala srivari temple seven dwarams for devotees darshan tweet goes viral
ఆంధ్రప్రదేశ్

Tirumala Darshan 7 Dwarams Srivari Temple,తిరుమల గర్భగుడికి 7 ద్వారాలు.. వారికి మాత్రమే శ్రీవారిని చాలా దగ్గరగా దర్శించుకునే అవకాశం! – significance of tirumala srivari temple seven dwarams for devotees darshan tweet goes viral

.By .4 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Darshan 7 Dwarams Srivari Temple,తిరుమల గర్భగుడికి 7 ద్వారాలు.. వారికి మాత్రమే శ్రీవారిని చాలా దగ్గరగా దర్శించుకునే అవకాశం! – significance of tirumala srivari temple seven dwarams for devotees darshan tweet goes viral
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Dwarams Of Srivari Temple At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారు. అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో ఉండే ఏడు ద్వారాల గురించి తెలుసా.. సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ అవుతొోంది. ‘తిరుమలలో గర్భగుడికి 7 ద్వారాలు ఉన్నాయి. వాటి విశిష్టతలు’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఏడు ద్వారాలకు ఉన్న విశిష్టతల్ని వివరించారు.. ఆ ఏడు ద్వారాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • తిరుమల శ్రీవారి గర్భగుడికి ఏడు ద్వారాలు
  • విశిష్టతల గురించి ట్వీట్ చేసిన ఓ నెటిజన్
  • వారికే శ్రీవారిని దగ్గరగా దర్శించుకునే ఛాన్స్
తిరుమలలో గర్భగుడికి 7 ద్వారాల విశిష్టతలు
తిరుమలలో గర్భగుడికి 7 ద్వారాల విశిష్టతలు (ఫోటోలు– Samayam Telugu)

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల నిత్యం దేశ, విదేశాల నుంచి వ్యయప్రయాసలకు ఓర్చి వస్తుంటారు.. స్వామివారిని దర్శించుకునే ఆ అద్భుతమైన ఘడియల్లో గొప్ప అనుభూతిని పొందుతారు. ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు సర్వ దర్శనం నుంచి వీఐపీ దర్శనం వరకు టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే తిరుమల శ్రీవారి గర్భగుడికి 7 ద్వారాలు ఉన్నాయని.. వాటి విశిష్టతలు ఇవే అంటూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. శ్రీవారి దర్శనానికి సంబంధించి భక్తులు ఏడు ద్వారాల విశిష్టతల్ని వివరించారు. ‘1. # కులశేఖర పాడి ద్వారం: అతి పవిత్రమైన ద్వారం. స్వామిని అత్యంత దగ్గరగా దర్శించే అవకాశం. కేవలం అర్చకులు, VVIPలకే అనుమతి.
2. # ఉత్సవ ద్వారం: స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చే ద్వారం. ముఖ్యమైన బ్రేక్ దర్శనాలు ఇక్కడి నుంచే.
3. # సేవా ద్వారం: ఆర్జిత సేవలు (కల్యాణోత్సవం, తోమాల సేవ) చేసేవారికి. ప్రత్యేక పూజలలో పాల్గొనే భక్తులు ఈ ద్వారం ద్వారా ప్రవేశిస్తారు.
4. # శ్రీవాణి ద్వారం: శ్రీవాణి ట్రస్టు విరాళం ఇచ్చినవారికి ప్రత్యేక ప్రవేశం. తక్కువ సమయం, మంచి దర్శనం.
5. #బ్రేకు దర్శన ద్వారం: సాధారణ బ్రేక్ దర్శన టికెట్ కలిగిన భక్తులకు.. మధ్య స్థాయి దూరం నుండి స్వామి దర్శనం.
6. #ఫ్రీ దర్శన ద్వారం : ఉచిత దర్శన భక్తులకు. ఎక్కువ వేచిచూపు, కాని భక్తిపరంగా గొప్ప అనుభూతి.
7. #మహా ద్వారం: ఇది గర్భగుడి బయటకు వచ్చే ప్రధాన ద్వారం. భక్తుల నిష్క్రమణ మార్గం.’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

అయితే తిరుమల శ్రీవారి ఏడు ద్వారాలు, ఏడు మండపాలు అని పిలిస్తారనే మరో వాదన కూడా ఉంది. ఈ ఏడు ద్వారాకలు ఆధ్యాత్మికంగా విశిష్టత ఉందని చెబుతుంటారు. ‘ఈ ఏడు ద్వారాలను.. భక్తులు ఆత్మను పరమాత్మను చేరడానికి ఏడు దశలు, మానవ శరీరంలోనే ఏడు చక్రాలను సూచిస్తాయనే నమ్మకం. తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ ఏడు ద్వారాలు దాటడం మోక్ష మార్గంలో అడుగులు వేయడంతో సమానం’ అని చెబుతుంటారు.

1. మహాద్వారం (పడికావలి/సింహద్వారం):

ఈ మహాద్వారాన్ని ఆలయానికి ప్రధాన ద్వారంగా చెబుతుంటారు. ఆలయంలోకి ప్రవేశించడానికి.. భక్తులు బయట విషయాలను వదిలేసి ఆ స్వామివారిని దర్శించుకోవడానికి మొదలు పెట్టే ఆధ్యాత్మిక ప్రయాణం కోసం సిద్ధపడటాన్ని ఈ ద్వారం సూచిస్తుంది. ఈ ద్వారానికి ఇరువైపులా స్వామివారి సంపదలకు సంరక్షకులుగా శంఖనిధి, పద్మనిధిల రక్షఖ దేవతల పంచలోహ విగ్రహాలు ఉంటాయి.

2. నాడిమి పడికావలి (వెండి వాకిలి/ లోపలి గోపురం):

మహాద్వారం అనంతరం ధ్వజస్తంభ మండపం నుంచి చేరుకునే లోపలి ద్వారం.. ఈ ద్వారం తలుపులు వెండి తాపడంతో అలంకరించారు. అందుకే ఈ ద్వారాన్ని వెండి వాకిలి అని కూడా అంటారు. భక్తులు మనస్సును శుద్ధి చేసుకుని అంతర్గతంగా ప్రశాంతతను పొందడానికి ప్రయత్నించడం.

3. బంగారు వాకిలి (బంగారు గడప/బంగారు ద్వారం):

ఈ ద్వారం గర్భగుడికి అత్యంత సమీపంలో పవిత్రమైన ద్వారం అని చెబుతారు.. బంగారంతో మెరిసిపోతూ ఉంటుంది. ఈ ద్వారానికి ఇరువైపులా జయ, విజయుల విగ్రహాలు ఉంటాయి. ఈ ద్వారం నుంచి భక్తులు స్వామివారి మూలవిరాట్‌ను దర్శించుకుంటారు. ఈ ద్వారం ఆ పరమాత్మకు దగ్గరయ్యే స్థితిని సూచిస్తుందని చెబుతారు. భక్తులు భక్తివావంతో అహంకారాన్ని విడిచిపెడతారు.

4. కులశేఖరపడి:

ఈ కులశేఖరపడి బంగారు వాకిలి లోపల, గర్భగుడికి సరిగ్గా ముందు ఉంటుంది. కులశేఖర ఆళ్వార్ తాను స్వామి పాదల చెంత ఉండాలని ఆకాంక్షించాడని.. అందుకే ఇది పవిత్రమైనదిగా భావిస్తారట. ఈ కులశేఖరపడి ఆ శ్రీవారి పట్ల పరిపూర్ణ శరణాగతిని, నిస్వార్థ భక్తి, వినయాన్ని సూచిస్తుందని చెబుతుంటారు.

5. రాములవారి మేడ (ఘంటా మండపం, స్నపన మండపం కలిపి):

ఈ ద్వారం ఉన్న చోట రాములవారు, సీత, లక్ష్మణుల విగ్రహాలు ఉంటాయని చెబుతారు. ఆలయంలో కైంకర్యాలు జరిగే మండపాలకు దగ్గరగా ఉంటుంది.. ఘంటా మండపంలో స్వామివారి విశేషాలను.. స్నపన మండపంలో స్వామివారి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సత్యాన్ని గ్రహించి, జ్ఞానాన్ని పొందే దశ.. ఆ స్వామివారి లీలలు, మహిమల్ని తెలుసుకోవడం ద్వారా భక్తిని పెంపొందించుకోవాడాన్ని తెలియజేస్తుంది.

6. గరుడ మండపం:

ఈ గరుడ మండపం బంగారువాకిలికి ఎదురుగా ఉంటుంది.. ఈ గరుడుడు శ్రీమహావిష్ణువుకు వాహనం, నిత్య సేవకుడు కూడా.. ఇది భగవంతుని సేవకునిగా మారి సేవ చేస్తారు. భక్తులు తనను స్వామివారికి సేవకుడిగా భావించి అంకిత భావంతో ఉంటారు.

వీఐపీలు ఇలా చేయండి.. తిరుమల శ్రీవారి దర్శనంపై వెంకయ్య సలహా

7. గర్భగుడి (ఆనంద నిలయం):

ఈ గర్భ గుడి (ఆనంద నిలయం)లో ఆ తిరుమల శ్రీవారి మూలవిరాట్ కొలువై ఉంటారు. ఇక్కడే భక్తులకు స్వామివారి ప్రత్యక్ష దర్శనం లభిస్తుంది. భక్తులు భగవంతుడితో ఏకం కావడం, మోక్సాన్ని పొందడం, పరిపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి