Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Viral Video: ఈ నాగుపాము చిన్నదైనా పడగ విప్పింది.. తర్వాత ఈ 2 కోళ్లు ఏం చేశాయంటే..?

4 August 2025

Viral Video: ఎచ్చులకు పోతివి..ఎల్లెల్కల పడితివి..అవసరమా బ్రో… ఉత్తపుణ్యానికి బైక్‌ పాయె.. వైరల్‌ వీడియో

4 August 2025

IND vs ENG : వోక్స్.. నువ్వు గొప్పోడివి సామి.. గాయమైనా సింగిల్ హ్యాండ్‌తో బ్యాటింగ్..

4 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Banaganapalle Police Seized Saubhagya Packets,మహిళలు పొరపాటున కూడా ఆ ప్యాకెట్లు కొనొద్దు.. జస్ట్ రూ.6 అనుకోవద్దు, ఆ పౌడర్ చాలా డేంజర్.. పోలీసుల హెచ్చరిక – police seized sowbhagya kallapi rangoli packets in banaganapalli nandyal district
ఆంధ్రప్రదేశ్

Banaganapalle Police Seized Saubhagya Packets,మహిళలు పొరపాటున కూడా ఆ ప్యాకెట్లు కొనొద్దు.. జస్ట్ రూ.6 అనుకోవద్దు, ఆ పౌడర్ చాలా డేంజర్.. పోలీసుల హెచ్చరిక – police seized sowbhagya kallapi rangoli packets in banaganapalli nandyal district

.By .4 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Banaganapalle Police Seized Saubhagya Packets,మహిళలు పొరపాటున కూడా ఆ ప్యాకెట్లు కొనొద్దు.. జస్ట్ రూ.6 అనుకోవద్దు, ఆ పౌడర్ చాలా డేంజర్.. పోలీసుల హెచ్చరిక – police seized sowbhagya kallapi rangoli packets in banaganapalli nandyal district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Sowbhagya Kallapi Rangoli Packets Seized: పోలీసులు మహిళల్ని హెచ్చరించారు.. అలాగే కిరాణా షాపుల వారికి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో మహిళలు సౌభాగ్య పౌడర్ పేరుతో ప్యాకెట్లు దొరుకుతున్నాయి..అయితే ఆ పౌడర్‌ను నీళ్లలో కలిపి ఇళ్ల ముందు కళ్లాపిలా చల్లుతున్నారు. అయితే ఈ సౌభ్యాగ పౌడర్‌లో కెమికల్స్ ఉన్నాయని.. చాలా డేంజర్ అంటున్నారు పోలీసులు. తాజాగా నంద్యాల జిల్లాలో ఈ సౌభాగ్య ప్యాకెట్లను సీజ్ చేశారు పోలీసులు.

హైలైట్:

  • నంద్యాల జిల్లాలో సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లు సీజ్
  • ఈ పౌడర్‌లో కెమికల్స్ కలుపుతారంటున్నారు
  • ఇది చాలా డేంజర్ అంటున్న పోలీసులు
కోవెలకుంట్ల సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లు
కోవెలకుంట్ల సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లు (ఫోటోలు– Samayam Telugu)

ఏపీలో మహిళలకు హెచ్చరిక.. షాపుల్లో దొరికే ఆ పౌడర్ చాలా డేంజర్ అని తేలింది. తాజాగా నంద్యాల జిల్లాలో ఆ ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేయడం కలకలం రేపింది. ఈ పౌడర్ చాలా డేంజర్ అని.. ఉపయోగించొద్దని సూచిస్తున్నారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పోలీసులు సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఇళ్ల ముందు మహిళలు పేడకు బదులుగా చల్లేందుకు సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఆ పౌడర్‌ను నీళ్లలో కలిపి ఇళ్ల ముందు చల్లుతున్నారు.. అయితే ఈ పౌడర్ చాలా డేంజర్ అంటున్నారు పోలీసులు. ఈ క్రమంలో సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లను అమ్ముతున్న షాపులపై పోలీసులు దాడులు చేసి సీజ్ చేశారు.సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లలో కెమికల్స్ ఉన్నాయని.. ఈ పౌడర్‌ను నీళ్లలో కలిపి ఇంటి ముందు ఆరోగ్యానికి ప్రమాదం.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో వాటిని నిషేధిస్తు్న్నామన్న పోలీసులు తెలిపారు. ఈ మధ్య కాలంలో మహిళలు ఇళ్ల ముందు పేడ బదులుగా సౌభాగ్య ప్యాకెట్లు వాడుతున్నారని.. కొందరు మహిళలు క్షణికావేశంలో ఈ పౌడర్ తాగి ప్రాణాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయంటున్నారు. ఈ పౌడర్ నీళ్లలో కలుపుకుని తాగడంతో ప్రాణాలు పోతున్నాయని చెబుతున్నారు. అందుకే ఈ ప్యాకెట్లు విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తాజాగా కోవెలకుంట్లలో నిషేధిత సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లను సీజ్ చేశారు. నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

గత కొంతకాలంగా సౌభాగ్య పేరుతో కిరాణా షాపుల్లో దొరికే ప్యాకెట్లను మహిళలు కొనుగోలు చేస్తున్నారు. పేడకు బదులుగా అదే రంగులో ఉండేలా.. ఈ పౌడర్‌ను నీళ్లలో కలిపి ఇళ్ల ముందు చల్లుతున్నారు. అయితే పౌడర్ డేంజర్ అని.. దీనిని ఉపయోగించొద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఈ సౌభాగ్య ప్యాకెట్ల అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సౌభాగ్య పౌడర్ వాడకం పెరిగిందని చెబుతున్నారు.. అయితే ఈ సౌభాగ్య పౌడర్ అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి