Farmer uses GPS to track down thieves: తన పొలంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు అతన్ని ఆవేదనకు గురిచేశాయి. పదే పదే తన పొలంలోని డ్రిప్పు పైపులను చోరీచేస్తున్న వారి సంగతి చూడాలనుకున్నాడు. గతంలో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవటంతో ఈసారి తనే సొంతంగా ప్లాన్ చేసుకున్నాడు. పక్కాగా ప్లాన్ అమలు చేసి.. చోరీ చేసిన వ్యక్తులను పట్టేసుకున్నాడు. పోలీసులకు అప్పగించాడు. ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన అశోక్ రెడ్డి అనే రైతు చేసిన పనిపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

*పైకి నవ్వుతూ కనిపించే హెచ్ఆర్ ఉద్యోగం.. లోపల మాత్రం.. భర్తే అనుకుంటే, మామ కూడానా?
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం సత్తారుపల్లికి చెందిన అశోక్‌రెడ్డికి కొంత వ్యవసాయ పొలం ఉంది. అందులో పంటలు సాగుచేస్తుంటారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో మొక్కజొన్న వేయాలని నిర్ణయించుకున్నారు. మొక్కజొన్న నాటేందుకు కూలీలను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే అదే రోజు రాత్రి అశోక్ రెడ్డి పొలంలో దొంగలు పడ్డారు. పొలంలో ఉన్న డ్రిప్పు పైపును చోరీ చేశారు. అయితే అశోక్ రెడ్డి పొలంలో డ్రిప్పు పైపులు, కేబుల్ వైర్లు చోరీ చేయడం అదే మొదటిసారి కాదు. 2020లో ఓసారి, 2022 సంవత్సరంలో మరోసారి కూడా ఇలాగే పొలంలో ఉన్న డ్రిప్పు పైపులు చోరీకి గురయ్యాయి. లక్ష రూపాయలు విలువ చేసే డ్రిప్పు పైపులు దొంగతనం కావటంతో గతంలో అశోక్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. అయితే ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో ఒకటికి మూడుసార్లు తన పొలంలో డ్రిప్పులు చోరీకి గురౌతూ ఉండటంతో.. ఈసారి ఎలాగైనా దొంగలను పట్టుకోవాలని తానే ప్లాన్ చేశారు అశోక్ రెడ్డి..
*దివ్యాంగులకు శుభవార్త.. పూర్తి ఉచితంగా, రూపాయి కట్టక్కర్లేదు.. మూడ్రోజులే ఛాన్స్..
లెక్చరర్‌కు షాకిచ్చిన అమ్మాయి.. ప్రియుడితో కలిసి
ఇంటర్నెట్‌లో వెతికి జీపీఎస్ ట్రాకర్ కొనుగోలు చేశారు. ఈ జీపీఎస్‌ను డ్రిప్పు పైపు మధ్యలో ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం తెలియని దొంగలు శనివారం రాత్రి చోరీకి వచ్చి మనోడు వేసిన ప్లాన్‌తో అడ్డంగా దొరికిపోయారు. పొలంలో ఉన్న డ్రిప్పు పైపులను శనివారం రాత్రి దొంగలు చోరీ చేశారు. ఆదివారం ఉదయాన్నే పొలానికి వచ్చిన అశోక్ రెడ్డి.. పైపులు చోరీ అయిన విషయం గుర్తించారు. వెంటనే జీపీఎస్ సాయంతో ఎక్కడ వెళ్తున్నాయనే సంగతి తెలుసుకున్నారు.
*ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలు గుర్తించుకోవాల్సిన రూల్స్ ఇవే..
ఇతర రైతుల సాయంతో ఎన్ఎస్ గేట్ సమీపంలో ఉన్న వాహనాన్ని, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అశోక్ రెడ్డి పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నా్రు. మరోవైపు ఇప్పటి వరకూ తమ పొలాల్లో చోరీ అయిన డ్రిప్పు పైపులను రికవరీ చేయించి ఇవ్వాలని మిగతా రైతులు పోలీసులను కోరుతున్నారు. అయితే ఆ చోరీలు కూడా వీరి పనేనా, వేరే వారి హస్తం ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.