TTD Sowbhagyam kits to Women for Varalakshmi Vratam: శ్రావణ మాసం, వరలక్ష్మీ వ్రతాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనేందుకు ఆలయాలకు వచ్చే మహిళా భక్తులకు సౌభాగ్యం పేరుతో కిట్లు అందించనుంది. ఉమ్మడి కడప జిల్లాలోని టీటీడీ విలీన ఆలయాలలో ఈ సౌభాగ్యం కిట్లను ఆగస్ట్ 8వ తేదీన పంపిణీ చేయనున్నారు. వరలక్ష్మీ వ్రతం పూర్తయిన తర్వాత మహిళలకు ఈ సౌభాగ్యం కిట్లు అందిస్తారు. ఇప్పటికే ఆలయాలకు ఈ కిట్లు చేరుకున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న 51 ఆలయాలలో వీటిని పంపిణీ చేస్తారు.

*డిటెక్టివ్‌గా మారిపోయిన రైతు.. రాత్రి పూట జరిగే యవ్వారాన్ని కనిపెట్టేశాడుగా!
ఉమ్మడి కడప జిల్లాలోని టీటీడీ విలీన ఆలయాలలో ఆగస్ట్ 8వ తేదీన సౌభాగ్యం పేరుతో సుమంగళి ద్రవ్యాల కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. సౌభాగ్యం పేరుతో అందించే ఈ సుమంగళి ద్రవ్యాల కిట్‌లో పసుపుకొమ్ము, కుంకుమ పొట్లం, రెండు కంకణాలు, అర డజను గాజులు, ఒక పసుపు ధారం ఉంటాయి.
*ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలు గుర్తించుకోవాల్సిన రూల్స్ ఇవే..
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం నేపథ్యంలో ఒంటిమిట్ట కోదండ రామాలయానికి 4000 సౌభాగ్యం కిట్లు అందించారు. అలాగే దేవుని కడపలోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి 4000, జమ్మలమడుగు నారాపుర వేంకటేశ్వరస్వామి ఆలయానికి 2 వేలు, నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయం, తాళ్లపాకలోని ఆలయాలకు 2 వేలు చొప్పున టీటీడీ సౌభాగ్యం కిట్లను పంపింది. ఆయా ఆలయాలలో వరలక్ష్మీ వ్రతం పూజల అనంతరం మహిళలకు ఈ సౌభాగ్యం కిట్లు పంపిణీ చేస్తారు. సౌభాగ్యం కిట్లతో పాటుగా మహాలక్ష్మీ చతుర్వింశతి నామావళిః మంత్ర పత్రాన్ని కూడా అందజేయనున్నారు.
*దివ్యాంగులకు శుభవార్త.. పూర్తి ఉచితంగా, రూపాయి కట్టక్కర్లేదు.. మూడ్రోజులే ఛాన్స్..
మరోవైపు శ్రావణ మాసం నేపథ్యంలో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. శుభకార్యాలకు మంచి ముహర్తాలు ఉండటంతో పాటుగా ఆగస్ట్ నెలలో పలు పర్వదినాలు కూడా వచ్చాయి. వివాహాలు, వరలక్ష్మీ వ్రతాలు, వినాయక చవితి పండుగ, శ్రీకృష్ణాష్టమి పర్వదినం , రాఖీ పౌర్ణమి వంటి పండుగలు ఈ నెలలోనే రావటంతో ఆలయాల వద్ద భక్తుల సందడి ఉండే అవకాశం ఉంది.
ఎంత ఏఐ వచ్చినా గంటలో శ్రీవారి దర్శనం అసంభవం: మాజీ సీఎస్ ఎల్వీ
కార్వేటి నగరంలో తెప్పోత్సవాలు
మరోవైపు కార్వేటినగరం వేణుగోపాలస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 6 నుంచి 8వ తేదీ వరకూ మూడు రోజుల పాటు కార్వేటినగరం వేణుగోపాలస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయప్రదానం చేస్తారు. అలాగే ఈ మూడు రోజులు ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.