
కొంత మంది రీల్స్ పిచ్చిలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. ప్రాణాంతకమైన పాములు, పులులతోటి సెల్ఫీలు దిగే ప్రయత్నం చేస్తూ మృత్యువాత పడుతున్నారు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా నుండి ఒక షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. దీనిలో ఒక యువకుడు సింహం దగ్గరకు వెళ్లి తన ప్రాణాలను పణంగా పెట్టడం కనిపించింది. ఈ వీడియో నెట్టింట మరింత వైరల్ అవుతోంది. ఆ యువకుడి బాధ్యతారహిత చర్యపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఈ సంఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా తలాజాలోని బాంబోర్ గ్రామంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇది గిర్ నేషనల్ పార్క్ సమీపంలో ఉంది. ఈ ప్రాంతం ఆసియా సింహాల జనాభాకు ప్రసిద్ధి చెందింది. వైరల్ వీడియోలో, ఒక సింహం దాని ఎరను తింటున్నట్లు మీరు చూడవచ్చు. అప్పుడు ఒక యువకుడు దాని దగ్గరగా వెళ్లి తన మొబైల్‌లో వీడియోను రికార్డ్ చేయడం ప్రారంభించాడు.
కానీ సింహం ఆ యువకుడిని చూసిన వెంటనే అది తన ఆహారాన్ని వదిలి కోపంతో అతని వైపు గర్జిస్తుంది. అతని వైపు కొన్ని అడుగులు దూసుకొచ్చింది. ఇది చూసి భయపడిన ఆ యువకుడు వెననకు వేగంగా పరిగెత్తడం ప్రారంభించాడు. వీడియోలో, మరికొందరు దూరం నుండి అరుస్తూ సింహాన్ని దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తున్నట్లు వినవచ్చు. దీని కారణంగా యువకుడి ప్రాణాలు దక్కాయి. అతను అక్కడి నుండి తప్పించుకోగలిగాడు.
వీడియో చూడండి:
भावनगर, गुजरात
भाईसाहब शेर के मुंह से निवाला छीनने नहीं गए थे…
बस शेर को कहने गए थे —
“भाई एक फोटो दे दे, Social Media पे डालनी है, तू दिखेगा तो लाइक ज़्यादा आएंगे!”शेर: भग bsdk
pic.twitter.com/rlSWU2Erq8
— jiiteender Singh Kalsi (@jiiteender) August 4, 2025
ఈ వీడియో నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. యువకుడి ఈ చర్యను ప్రజలు ‘మూర్ఖత్వం’ అంటూ పోస్టులు పెడుతున్నారు. యువకుడిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.