హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వాన కురిసింది. ఒక్క గంటలోనే 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.1లో వాహనాలపై భారీ చెట్టు కూలిపోయింది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నాక, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో భారీ వర్షం దంచికొట్టింది. గంటకు 30 నుంచి 40 కి.మీ.వేగంతో గాలులు వీచాయి. అప్రమత్తమైన హైడ్రా, జీహెచ్‌ఎంసీ బృందాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి.
వీడియో చూడండి:
షేక్‌పేట్‌లో అత్యధికంగా 7.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆసిఫ్‌నగర్‌లో 5.3, ఖైరతాబాద్‌లో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పంజాగుట్ట-మాసాబ్‌ట్యాంక్ రోడ్డులో ట్రాఫిక్ ట్రామ్ ఏర్పడింది. రాజ్‌భవన్ సమీపంలో రోడ్లపై మోకాలిలోతు నీరు నిలిచిపోయింది. మరింత భారీ వర్షసూచన ఉండటంతో ఉద్యోగులకు సేఫ్టీ గైడ్‌లైన్స్ జారీచేసింది పోలీసు శాఖ. దశలవారీగా ఇళ్లకు బయల్దేరారని సూచించింది.
రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.