AP Government Plans to Life Tax Exemption for Caravan Vehicles: ఏపీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకునే టూరిజం కారవాన్ వాహనాలకు లైఫ్ ట్యాక్ మినహాయించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నూతన టూరిజం కారవాన్ పాలసీ తీసుకురానుంది. ఈ నేపథ్యంలోనే కారవాన్ వెహికల్స్‌కు లైఫ్ ట్యాక్స్ మినహాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఏపీ పర్యాటక శాఖ అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం.. బేసిక్ కారవాన్ వాహనం ధర కోటి రూపాయలుగా ఉంటుంది. ఇక అందులో ఉండే సౌకర్యాలు, సదుపాయాలను అనుసరించి కోట్లల్లో ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో 5 శాతం లైఫ్ ట్యాక్స్ విధిస్తున్నారు. ఈ లైఫ్ ట్యాక్స్ రేట్ల ప్రకారం కారవాన్ ధర కనీసం కోటి రూపాయలుగా అనుకున్న కూడా వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో రవాణా శాఖ అధికారులకు లైఫ్ ట్యాక్స్ కింద రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో లైఫ్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తే టూరిజం కారవాన్ యజమానులకు కనీసం పది లక్షల వరకూ ఆదా అవుతుందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో మరిన్ని టూరిజం కారవాన్ వాహనాలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.
APTDC Employee: ప్రభుత్వ ఉద్యోగి.. రాత్రి వేళ మహిళతో ఆఫీసులోకి.. ఏంటిది సారూ!
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కారవాన్ పార్కులు ఏర్పాటు చేయాలనే ఆలోచనలోనూ ఉంది. భీమిలి, అరకు సహా మరికొన్ని పర్యాటక ప్రాంతాలలో ఈ కారవాన్ పార్కులు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తోంది. అల్లూరి జిల్లాలోని ఐదు చోట్ల ఈ కారవాన్ పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. సందర్శకులు కావాలనుకున్నప్పుడు రెస్ట్ తీసుకునేలా నిరంతరం అందుబాటులో ఉండే కారవాన్ వాహనాలు, వసతి సౌకర్యాలు, పార్కింగ్ కారవాన్ పార్కులలో ఏర్పాటు చేయనున్నారు. వాకింగ్ ట్రాక్‌లు, సిట్-అవుట్ ఏరియాలు,బ్యాడ్మింటన్ కోర్టులు, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలను ఈ కారవాన్ పార్కులలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.