మహేష్ అభిమానులు ప్రస్తుతం అతడు మత్తులో ఉన్నారు. మొన్నటి వరకు ఖలేజా సినిమా రీ రిలీజ్ ఎంజాయ్ చేసిన వాళ్లు.. ఇప్పుడు అతడు మాయలో ఉన్నారు. రాజమౌళి ఇచ్చినపుడు ఇస్తారులే అని వాళ్ల ఆనందాన్ని వాళ్లే వెతుక్కుంటున్నారు.
ఈసారి మహేష్ పుట్టిన రోజును అతడు సినిమాతో సెలెబ్రేట్ చేయాలని చూస్తున్నారు. రాజమౌళి సినిమా అంటేనే హీరోలు మూడు నాలుగేళ్లు లాక్ అయిపోవడం అని అర్థం.
అందుకే SSMB29 నుంచి అప్డేట్స్ పెద్దగా ఆశించట్లేదు ఫ్యాన్స్.. వచ్చినపుడు చూసుకుందాం అనుకుంటున్నారు. మరోవైపు SSMB29 షూట్‌కు రాజమౌళి చిన్న బ్రేక్ ఇస్తున్నారని తెలుస్తుంది.
ఆగస్ట్ అంతా నెక్ట్స్ షెడ్యూల్స్ కోసం ప్రిపరేషన్ నడుస్తుంది. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.. నెక్ట్స్ షెడ్యూల్ సౌత్ ఆఫ్రికాలోని టాంజానియాలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ముందు కెన్యాలో ఈ షెడ్యూల్ ప్లాన్ చేసినా.. ఇప్పుడది ఆఫ్రికాకు మార్చారు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్‌తో బిజీగా ఉన్నారు రాజమౌళి. ఆగస్ట్ 9న బర్త్ డే ఉండటంతో.. ఈలోపు మహేష్ కూడా చిన్న వెకేషన్ వెళ్లొచ్చే అవకాశం లేకపోలేదు.