మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవలు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో పౌరసేవలను 700లకు పెంచాలని నిర్ణయించింది. ఆగస్ట్ 15వ తేదీ నాటికి 700 పౌర సేవలను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను జనవరిలో ప్రారంభించారు. 161 సేవలతో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం కాగా.. ఈ సేవలను క్రమంగా వేయికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

*ఏపీలోని కల్లుగీత కార్మికులకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
అలాగే ఆర్టీసీ బస్ టికెట్ల నుంచి దేవాలయాల సేవల వరకూ.. రెవెన్యూ సేవల నుంచి కరెంట్ బిల్లుల చెల్లింపుల వరకూ అనేక సేవలు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నారు. 2025 జనవరిలో 161 సేవలతో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ మొదలైంది. క్రమంగా ఈ సేవల సంఖ్యను ప్రస్తుతం 500లకు చేర్చారు. ఆగస్ట్ 15వ తేదీ నాటికి ఈ సంఖ్యను 700 సేవలకు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
ఆటోలో సీఎం చంద్రబాబు ప్రయాణం..
*ఏపీలో ఆ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు.! కనీసం రూ.5 లక్షలు ఆదా..
మరోవైపు రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వివిధ శాఖలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగిస్తే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. అలాగే కుటుంబాలను యూనిట్‌గా తీసుకుని పథకాలు రూపొందించాలని సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,47,871 సాధించాలని.. అలాగే 2029 నాటికి రూ. 5.42 లక్షలు చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
*డిటెక్టివ్‌గా మారిపోయిన రైతు.. రాత్రి పూట జరిగే యవ్వారాన్ని కనిపెట్టేశాడుగా!
అలాగే ఒక కంపెనీలో తయారైన వేస్టేజీ మరో కంపెనీలో ముడిసరుకుగా ఉపయోగపడేలా సర్క్యులర్ ఎకానమీ రూపొందించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా మార్చేలా అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని.. ఆ దిశగా స్వల్ప, మధ్య, దీర్ఘ స్థాయి లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని చంద్రబాబు సూచించారు.