ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో టైట్ దుస్తులు ధరించడం ఒక ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా చిన్నపిల్లలు స్టైలిష్‌గా కనిపించాలని టైట్ జీన్స్ లేదా లోదుస్తులు ధరించడానికి ఇష్టపడతారు. కానీ ఈ టైట్ బట్టలు మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? టైట్ ప్యాంట్స్ వేసుకున్నప్పుడు నడవడం, కూర్చోవడం వంటి సమస్యలే కాకుండా మగవాళ్లలో అయితే వీర్య కణాలు సంఖ్య కూడా తగ్గుతుందట.. ఇది మేము చెబుతున్న మాట కాదు.. కొందరు ఆరోగ్య నిపుణులు పరిశోదనల ద్వారా తెలియజేస్తున్నారు. దీని వల్ల మగవాళ్లకు ఫ్యూచర్‌లో సంతానోత్పత్తి సమస్యలు కూడా రావచ్చని చెబుతున్నారు.
మన డ్రెస్సింగ్ అలవాట్లు మన జీవితంపై ఏలాంటి ప్రభావం చూపుతాయో అనే దాని గురించి ఎవరూ ఆలోచించరూ. అందుకే ఏవి పడితే ఆ దుస్తులు ధరిస్తుంటారు. ముఖ్యంగా టైట్‌గా ఉండే దుస్తులు ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత, వృషణాల చుట్టూ ఉష్ణోగ్రత పెరుగుతుందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. మన వృషణాల ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే స్పెర్మ్ ఏర్పడటానికి సరైన ప్రక్రియ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
స్పెర్మ్ అనేది చాలా సున్నితమైన కణం. ఇది సాధారణ ఉష్ణోగ్రతలో మాత్రమే ఏర్పడుతుంది. కానీ మనం తరచూ టైట్‌గా ఉండే దుస్తువులను ధరించడం వల్ల అవి మన శరీరానికి అతుక్కుపోయి వేడిని బయటకు పోనివ్వకుండా చేస్తాయి. దీని వల్ల లోపల ఉష్ణోగ్రలు పెరిగిపోయి స్పెర్మ్ ఏర్పడే ప్రక్రియను నెమ్మదిస్తుంది. బ్రిటన్‌లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, టైట్ ప్యాంట్స్ ధరించే వారి కంటే రెగ్యులర్ ఫిట్ లేదా లూజ్ ప్యాంట్స్ ధరించే పురుషులలో వీర్యకణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు, హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధన కూడా బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం వల్ల వీర్యకణాల సంఖ్య 25 శాతం తగ్గుతుందని వెల్లడైంది.
పురుషుల వృషణాలు శరీరంలోని మిగిలిన భాగాల కంటే చల్లని వాతావరణంలో జీవించేలా సృష్టించబడ్డాయి. అందుకే అవి శరీరం లోపల కాకుండా బయట ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే మీరు టైట్‌గా ఉండే దుస్తులు ధరించినప్పుడు వృషణాలు అనేవి శరీరానికి దగ్గరగా వస్తాయి. ఇది స్పెర్మ్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
స్పెర్మ్ కౌంట్‌ను పెంచుకోవాలంటే వీటిని పాటించడండి
- మీ ఫోన్‌ను ప్యాంటు జేబులో పెట్టుకోవడం మానేయండి
- శరీరంలోకి గాలి వీచే రకంగా కాస్త లూజ్‌గా ఉండే బట్టలు ధరించండి
- మీ ప్రైవేట్ భాగాలను తరచూ నీటుగా శుభ్రం చేసుకోండి
- మీ రోజువారి జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసకోండి
- ఒక వేల మీరు డ్రగ్స్, గంజాయి, సిగరేట్ వంటి వ్యసనాలకు అలవాటు పడితే మానేయండి
- రోజూ మద్యం, ధూమపానం సేవించడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి
- గుడ్లు, బెర్రీలు, వాల్‌నట్‌లు, తాజా పండ్లు, కూరగాయలు వంటి సమతుల్య ఆహారం తీసుకోండి
గమనిక: గమనిక ఈ అంశాలు కొన్ని, నివేదికలు, నిపుణుల సలహాల మేరకు తెలియజేస్తున్నాం.. వీటి పట్ల మీకు ఎవైనా సందేహాలు ఉంటే.. అందుకు సంబంధించిన వైద్యులు సహాలు తీసుకోండి!
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.