టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఇంగ్లాండ్ పర్యటనలో తన కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించాడు. సిరీస్‌ను గెలవలేకపోయినా, వారు 2-2తో డ్రాగా ముగించగలిగారు. అయితే గిల్ తన తొలి కెప్టెన్సీలో అద్భుతమైన ప్రదర్శనతో ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో గిల్ నాయకత్వంలో భారత జట్టు రెండు టెస్ట్ మ్యాచ్‌లను గెలుచుకుంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలో రెండు టెస్ట్ విజయాలు నమోదు చేసిన కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ కెప్టెన్ల జాబితాలో గిల్ చేరాడు.
ముఖ్యంగా శుభ్‌మన్ గిల్ తన తొలి కెప్టెన్సీలో ఈ మైలురాయిని సాధించాడు. ఇది అతనికి పెద్ద విజయం. మొదటి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ, సేన దేశాలలో టీమిండియా తరపున అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లను గెలిచిన కెప్టెన్. కోహ్లీ కెప్టెన్సీలో భారతదేశం 7 టెస్ట్ మ్యాచ్‌లను గెలుచుకుంది. బ్యాట్స్‌మన్‌గా గిల్ ఇంగ్లాండ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ అద్భుతంగా రాణించాడు. అతను ఆడిన ఐదు టెస్ట్ మ్యాచ్‌లలో 75.40 సగటుతో 754 పరుగులు చేశాడు, వాటిలో నాలుగు సెంచరీలు ఉన్నాయి. అతని బ్యాటింగ్.. జట్టును బలోపేతం చేయడమే కాకుండా అతనికి అనేక వ్యక్తిగత గౌరవాలను కూడా తెచ్చిపెట్టింది.
ఈ పర్యటనలో అద్భుతంగా రాణించిన గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి. దీనితో ఇంగ్లాండ్‌లో ఈ రెండు అవార్డులను గెలుచుకున్న రెండవ భారత కెప్టెన్ అయ్యాడు. అతనికంటే ముందు విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనతను సాధించాడు. ఈ పర్యటన గిల్ కెరీర్‌లో ఒక ప్రధాన మైలురాయి మాత్రమే కాదు, భారత క్రికెట్ భవిష్యత్తుకు కూడా మంచి సంకేతం. శుభ్‌మాన్ గిల్ ఈ పర్యటన ద్వారా తాను గొప్ప బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు. గొప్ప కెప్టెన్ కూడా అని నిరూపించుకున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..