ఓ వ్యక్తి క్రమేపీ పెరిగిపోతున్న తన పొట్ట చూసి తీవ్రమైన మనోవేదన చెందాడు. ఎన్ని మందులు వేసుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. కొబ్బరి బొండంలా ఉబ్బిపోయిన ఆ పొట్టతో అస్పత్రికొచ్చాడు. అక్కడి డాక్టర్లు అతడికి పలు టెస్టులు చేయగా.. ఎక్స్‌రేలో అతడి కడుపులో 23 పౌండ్ల బరువున్న ఓ కణితిని గుర్తించారు. దానితో ఎనిమిది నెలలుగా తీవ్ర ఇబ్బందిని, బాధను భరిస్తున్న అతన్ని ఊపిరి పీల్చుకునేలా చేశారు. సుమారు రెండు గంటల పాటు శస్త్రచికిత్స అనంతరం ఆ కణితిని డాక్టర్లు తొలగించారు. అతడి కడుపులో భారీ జీర్ణశయాంతర స్ట్రోమల్ కణితి ఉందని.. అది అతడి అవయవాలు, రక్త నాళాలను చిద్రం చేసే స్థాయికి వచ్చాయని డాక్టర్లు పేర్కొన్నారు. అలాగే సదరు వ్యక్తి.. ఈ ఉబ్బిన పొట్ట కారణంగా సరిగ్గా నడవలేకపోవడం, తీవ్రమైన కడుపునొప్పి లాంటి లక్షణాలు అనుభవించాడని తెలిపారు. అటు ఈ కణితి మూత్రపిండాల విస్తరణకు కూడా కారణమైందన్నారు డాక్టర్లు.
ఢిల్లీ ఆస్పత్రి వైద్యుల ప్రకారం.. కణితి అపారమైన పరిమాణం, అది బహుళ ఉదర అవయవాలను నొక్కేస్తుండటంతో శస్త్రచికిత్స చాలా రిస్క్‌తో కూడుకున్నదిగా అభివర్ణించారు. అటు ఆపరేషన్ అనంతరం కొద్దిరోజులకు ఆ వ్యక్తి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యాడన్నారు. ‘ఈ రకమైన శస్త్రచికిత్సకు సాంకేతిక ఖచ్చితత్వం మాత్రమే కాకుండా, అన్ని ప్రత్యేక విభాగాలలో దృఢమైన టీం ఎఫర్ట్ అవసరం’ అని శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ బన్సాల్ అన్నారు. కాగా, ఇలాంటి కణితిలు జీర్ణశయాంతర ప్రేగులలోని నిర్దిష్ట కణాలలో ఉద్భవించే అరుదైన క్యాన్సర్లుగా మారవచ్చునని వివరించారు. ఈ కణితి ఏర్పడిన తర్వాత బాధితుడిలో లక్షణాలు కొంతకాలం కనిపించకపోయినా.. తరచుగా తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, రక్తస్రావం, వికారం లాంటివి ఉంటాయన్నారు.
ఇది చదవండి: ఎంతకు తెగించార్రా.. దొంగలు ఏం దొబ్బేశారో తెలిస్తే బిత్తరపోతారు..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..