మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చిన ఈ వయ్యారి భామ తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలి చిత్రం సీతారామం సినిమాతో మృణాల్ ఒక్కసారిగా స్టార్ గా మారిపోయింది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. సీతారామం సినిమా మంచి విజయం అందుకున్న తర్వాత మృణాల్ కు క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి. సీతారామం సినిమా తర్వాత నానితో కలిసి హాయ్ నాన్న అంటూ మరో క్లాసిక్ హిట్ అందుకుంది. హాయ్ నాన్న సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడు టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. కానీ ఆతర్వాత విజయ్ దేవరకొండతో కలిస్ చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి
దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ తగ్గాయి. చివరిగా కల్కి సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు అడవి శేష్ తో కలిసి డెకాయిట్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే మృణాల్ ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందని ఇప్పుడు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆ స్టార్ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో ధనుష్. ఈ స్టార్ హీరో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి
తాజాగా మృణాల్ బర్త్ డే పార్టీలో ధనుష్ కనిపించాడు. ధనుష్ మృణాల్ బర్త్ డే పార్టీలో కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే కొంతమంది మాత్రం త్వరలో ఈ ఇద్దరూ కలిసి నటించనున్నారని అంటున్నారు. ధనుష్ రాబోయే సినిమాలో మృణాల్ హీరోగా నటిస్తుంది కాబోలు అందుకే ఆమె బర్త్ డే పార్టీకి ధనుష్ వచ్చాడు అని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది
Dhanush and Mrunal Thakur are dating? pic.twitter.com/ItWYJdsm8a
— Aryan (@Pokeamole_) August 3, 2025
ధనుష్ ఇన్ ఇన్ స్టా గ్రామ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.