Tirumala Leopard Spotted: తిరుమలలో చిరుత సంచారం భయాందోళనలు రేపింది. ఈస్ట్ బాలాజీ నగర్ బాల గంగమ్మ ఆలయం దగ్గర చిరుత కనిపించింది. ఆ ప్రాంతంలో చిరుత తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఇటీవల కాలంలో తిరుమలతో పాటుగా తిరుపతిలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. తిరుపతిలో రెండు వారాల క్రితం బైక్‌పై వెళుతున్న వ్యక్తిపైకి చిరుత దూకిన ఘటన కలకలం రేపింది.
హైలైట్:
- తిరుమలలో మరోసారి చిరుత కలకలం
- బాలాజీ నగర్ ఆలయం దగ్గర ప్రత్యక్షం
- సీసీ కెమెరాలో రికార్డైన చిరుత వీడియో

ఇటీవల కాలంలో తిరుమలలో చిరుతల సంచారం పెరిగింది. గత నెలలో అన్నమయ్య భవనం సమీపంలో చిరుత కనిపించింది. చిరుత ఇంను కంచెను దాటుకుని వచ్చింది.. అయితే అటవీశాఖ సిబ్బందికి సమాచారం రావడంతో సైరన్లు మోగించారు.. ఆ వెంటనే చిరుత మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది. అన్నమయ్య భవనం దగ్గరకు చిరుత రావడం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తిరుపతిలో కూడా ఇటీవల కాలంలో చిరుతల సంచారం కనిపించింది.
Tirumala Walkway Leopard : శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత.. భయపడిపోయిన భక్తులు
గత నెలలో అలిపిరి చెక్ పాయింట్ దగ్గర జింకను చిరుత చంపినట్లు చెబుతున్నారు. జూపార్క్ సమీపంలో ఓ చిరుత దర్జాగా పిట్టగోడపై కూర్చుని ఉంది. రెండు వారాల క్రితం తిరుపతి జూపార్క్ రోడ్డులో ఓ చిరుత రోడ్డుపై బైక్‌పై వెళుతున్న వ్యక్తిపై ఒక్కసారి దూకేసింది. అయితే అతడు చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకున్నాడు. చిరుత అతడిపైకి దూకడాన్ని వెనుక వస్తున్న కారు కెమెరాలో రికార్డైంది. ఇలా వరుసగా చిరుతల సంచారంతో భక్తులు, స్థానికులు ఆందోళనలో ఉన్నారు. అటవీశాఖ అధికారులు చిరుతల సంచారాన్ని గమనిస్తున్నారు.