Andhra Pradesh Road Development Under HAM: రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వ దృష్టి పెట్టింది. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో రహదారులను అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు రహదారులను అభివృద్ధి చేయనున్నారు. రద్దీ అధికంగా ఉండే రహదారులను హ్యామ్ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అసలు హ్యామ్ విధానం అంటే ఏమిటీ.. ఈ విధానంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఏయే రహదారులు అభివృద్ధి చేయనున్నారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

*ఆగస్ట్ 15 నుంచి ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. 3 రోజుల ముందు ఏంటిది?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వాహనాల రద్దీ అధికంగా ఉన్న రోడ్లను హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హ్యామ్) విధానంలో అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట నియోజకవర్గాలలోని కొన్ని రహదారులను ఇందుకోసం ఎంపిక చేశారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే.. రహదారుల నిర్మాణానికి కావాల్సిన నిధులలో 40 శాతం డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
Hari Hara Veera Mallu Special Show : తిరుపతిలో దివ్యాంగులకు హరిహర వీరమల్లు స్పెషల్ షో
మిగతా 60 శాతం నిధులను కాంట్రాక్టర్‌కు బ్యాంక్ నుంచి రుణం రూపంలో ఇప్పిస్తుంది. ఈ నిధులతో కాంట్రాక్టర్ రోడ్లను అభివృద్ధి చేస్తారు. ఆ తర్వాత బ్యాంక్ నుంచి కాంట్రాక్టర్‌కు అందించిన రుణాన్ని ప్రభుత్వం 15 ఏళ్లల్లో విడత వారీగా బ్యాంకులకు చెల్లిస్తుంది. ఈ 15 ఏళ్లు కూడా కాంట్రాక్టర్ తాను వేసిన రోడ్ల నిర్వహణ, ఇతరత్రా పనులు చూడాల్సి ఉంటుంది.
*పట్టపగలు, ఆర్టీసీ బస్సులో ఛీఛీ ఇదేం పని.. మత్తుమందు ఇచ్చి మరీ.!
మరోవైపు సూళ్లూరుపేట- శ్రీకాళహస్తి రహదారిని పెరిమిటిపాడు నుంచి బుచ్చినాయుడుకండ్రిగ వరకూ విస్తరించనున్నారు. 22 కోట్ల రూపాయలతో ఈ రహదారిని అభివృద్ధి చేసేందుకు రోడ్లు భవనాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అలాగే బైరాజుకండ్రిగ – రామాపురం రోడ్డును ఆరుకోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నారు.
*డిటెక్టివ్‌గా మారిపోయిన రైతు.. రాత్రి పూట జరిగే యవ్వారాన్ని కనిపెట్టేశాడుగా!
వేడేం-రామాపురం-ముసలిపేడు రోడ్డును రూ.14 కోట్లతో, నాగలాపురం-చిన్నపాండూరు రహదారిని రూ.45 కోట్లతో అభివృద్ధి చేసేందుకు రోడ్లు భవనాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేసిన వెంటనే పనులు మొదలెట్టనున్నారు.