AP Government Magic Drain in Kolakaluru Tenali Mandal: గ్రామాలలో పారిశుద్ధ నిర్వహణను మెరుగుపరిచే దిశగా ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. పల్లెలలో మురుగు నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు మ్యాజిక్ డ్రెయిన్ విధానం అమలు చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా సోమవరం గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ మ్యాజిక్ డ్రైయిన్లను ఇప్పటికే నిర్మించారు. అక్కడ మంచి ఫలితాలు రావటంతో గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో అసలేంటీ మ్యాజిక్ డ్రెయిన్ విధానం అనేది తెలుసుకుందాం..

*డిటెక్టివ్‌గా మారిపోయిన రైతు.. రాత్రి పూట జరిగే యవ్వారాన్ని కనిపెట్టేశాడుగా!
మరోవైపు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ఇప్పటికే ఇక్కడ పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. కొలకలూరులో గతేడాది భారీ వర్షాలు కురిశాయి. దీంతో వీధుల్లో మురుగు నీరు నిల్వ ఉండిపోయింది. దీంతో దోమలు అధికమై విషజ్వరాలు, నీరు కలిషితమై అతిసార వచ్చింది. వీధుల్లో నిర్మించిన సిమెంట్ రోడ్ల పక్కన మురుగు నీరు వెళ్లేందుకు కాలువలు నిర్మించకపోవటంతో ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు వాపోయారు. ఈ నేపథ్యంలో మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో కొలకలూరు బీసీ కాలనీలో మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించనున్నారు.
*ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలు గుర్తించుకోవాల్సిన రూల్స్ ఇవే..
అసలేంటీ మ్యాజిక్ డ్రెయిన్లు..?
మ్యాజిక్ డ్రెయిన్ విధానం కింద ఇళ్లల్లో నుంచి వచ్చే వ్యర్థపు నీరు నేరుగా భూమిలో ఇంకేలా చూస్తారు. ఇందుకోసం సిమెంట్ రోడ్డు పక్కన, సమాంతరంగా మురుగు కాలువల స్థానంలో 3 కిలోమీటర్ల మేరకు డ్రెయిన్ నిర్మించనున్నారు. ఇళ్లల్లో నుంచి ఈ డ్రెయిన్‌లోకి చేరిన నీరు అక్కడి నుంచి మరోచోటకు పారకుండా ఉండేందుకు గానూ ఒకటిన్నర మీటర్ల లోతు ఉండేలా రోడ్డుకు పక్కనున్న ప్రదేశంలో ఈ డ్రెయిన్ నిర్మాణం చేపడతారు. అలాగే ప్రతీ 50 మీటర్లకు ఒక ఇంకుడు గుంత తవ్వుతారు. అందులో కంకర రాళ్లు నింపి పైన.. చిప్స్ అమర్చుతారు. డ్రెయిన్ పొడవునా కంకరరాళ్లు నింపుతారు. దీంతో మురికినీరు ఇంకుడుగుంతలోకి చేరిన తర్వాత వడపోతకు గురై.. భూమిలో ఇంకుతుంది. దీంతో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని అధికారులు చెప్తున్నారు.
Pawan Kalyan: వైల్డ్ యానిమల్‌ని ట్రైన్ చేసినట్టు నన్ను ట్రైన్ చేశారు: పవన్ కళ్యాణ్
*ఆగస్ట్ 15 నుంచి ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. 3 రోజుల ముందు ఏంటిది?
సాధారణంగా ఏర్పాటుచేసే కాంక్రీట్ ఛానెల్ డ్రైనేజ్ వ్యవస్థతో పోల్చితే మ్యాజిక్ డ్రెయిన్ల ద్వారా ఇళ్లల్లో నుంచి వచ్చే మురుగు నీరు నేరుగా భూమిలోకి ఇంకుతుంది. అలాగే ఖర్చు కూడా వాటితో పోల్చితే తక్కువ కావటంతో ఈ విధానాన్ని మరికొన్ని పల్లెలకు విస్తరించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది.