IND vs ENG 5th Test: ఓవల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ ఆరు పరుగుల తేడాతో చారిత్రక విజయం సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే, అందరి దృష్టిని ఆకర్షించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ మామ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, స్టాండ్స్‌లో ఉండి భారత విజయాన్ని చూసి ఉద్వేగంతో అరిచారు. అతని ఉత్సాహం అభిమానుల మనసులను గెలుచుకుంది. సునీల్ శెట్టి తన కొడుకు అహన్ శెట్టితో కలిసి స్టేడియంలో మ్యాచ్ చూస్తూ, భారత జట్టుకు తన సపోర్టు తెలిపారు.
సునీల్ శెట్టి సెలబ్రేషన్స్
భారత జట్టు గెలిచినప్పుడు సునీల్ శెట్టి అరిచిన కేకలు, ఆయన ఆనందం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. తన అల్లుడు కేఎల్ రాహుల్ జట్టు విజయం సాధించడంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. మ్యాచ్ ముందు ఆయన భారత జెండాను పట్టుకుని ఊపుతూ కనిపించారు. ఈ దృశ్యాన్ని ఆయన కుమారుడు అహన్ శెట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారత విజయం ఖాయం అయిన తర్వాత సునీల్ శెట్టి ఆనందంతో గట్టిగా అరిచిన వీడియోను Kunal_KLR అనే యూజర్ షేర్ చేయగా, అది క్షణాల్లోనే అభిమానుల మనసు దోచుకుంది.
Shetty Sir’s celebration at The Oval. 😍🔥 pic.twitter.com/gtcstrwJv9
— Kunal Yadav (@Kunal_KLR) August 4, 2025
సిరాజ్ అద్భుతం.. భారత్‌కు చారిత్రక విజయం
ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ విజయానికి కేవలం 374 పరుగులు మాత్రమే అవసరమైన తరుణంలో, సిరాజ్ ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 367 పరుగులకు ఆలౌట్ అయింది. కేవలం 7 పరుగుల తేడాతో సిరాజ్ భారత జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు.
సెలబ్రేషన్స్‌లో బాలీవుడ్ స్టార్స్
కేవలం సునీల్ శెట్టి మాత్రమే కాదు, కేఎల్ రాహుల్ భార్య, నటి అతియా శెట్టి కూడా తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో Unreal!!! అని పోస్ట్ చేశారు. అలాగే కరీనా కపూర్ ఖాన్ జై హింద్! అని రాస్తూ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూడా వాట్ ఎ ఫైట్, వాట్ ఎ ఫినిష్! టీమ్ ఇండియా సేఫ్‌గా ఆడదు, లెజెండ్స్ లా ఆడుతుంది! అంటూ ప్రశంసించారు.
ఈ విజయం కేవలం ఒక క్రీడా సంఘటన మాత్రమే కాదు. ఇది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఒకేతాటిపైకి తీసుకొచ్చిన ఉద్వేగభరితమైన క్షణం. సునీల్ శెట్టి ఉద్వేగభరితమైన సెలబ్రేషన్స్, బాలీవుడ్ సెలబ్రిటీల శుభాకాంక్షలతో ఈ విజయం దేశభక్తి, ఆనందానికి గుర్తుగా నిలిచిపోయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..