
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకాశానికి చిల్లుపడినట్టుగా, కుండలతో నీళ్లు కుమ్మరిస్తున్నట్టుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు ఊర్లకు ఊర్లనే తుడిచిపెట్టేస్తున్నాయి. వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. ధరాలి తర్వాత మళ్లీ ఇప్పుడు హర్షిల్ ప్రాంతంలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనతో అక్కడ స్థానిక ప్రజలకు తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. అలాగే, సుక్కి సమీపంలో కూడా కొండచరియలు విరిగిపడ్డట్లు సమాచారం. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…