కెరీర్లో కొత్త కొత్తవి చేయడం తనకు ఇష్డమని చెప్పిన నాగార్జున.. ఓ రోజు లోకేష్ వచ్చి ‘విలన్ రోల్ చేస్తారా సర్’ అని అడిగారని చెప్పాడు. తాను నో చెప్పినా కూడా కూల్‌గా తీసుకుని అంతే కూల్‌గా తన వెంట పడ్డాడని… చివరికి ఒప్పించాడని చెప్పుకొచ్చాడు నాగ్. తన ఆంటోనీ క్యారెక్టర్.. ఈసినిమాలో చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని అది కూడా తను ఈ సినిమాన చేయడానికి ఒక కారణం అంటూ నాగ్ చెప్పాడు. అంతేకాదు లోకేష్ కథ చెప్పేటప్పుడు తాను రికార్డ్ చేసుకున్నా.. ఇంటికి వెళ్లి మళ్లీ విన్నాను.. ఆ తర్వాత తాను కొన్ని పాయింట్స్ చెప్పా.. వాటిని లోకేష్ ఎంతో కూల్ గా తీసుకున్నాడు. ఆ తర్వాత 6,7సార్లు కథ చెప్పాడు. అలా ఫైనల్ గా కథను రెడీ చేశాడంటూ చెప్పాడు నాగ్. లోకేష్ అద్భుతంగా కథను రాసుకున్నాడు. రెండు రోజుల షూట్ చేశాం. రెండో రోజు షూట్ లో మేము ఓ సీన్ చేశాం.. కానీ అది లీక్ అయ్యింది. ఆ సీన్ లీక్ అయినప్పుడు చాలా భాదగా అనిపించిందంటూ చెప్పాడు నాగ్. కానీ ఆ సీన్ షూట్ తర్వాత సార్ మీరు ఇరగదీశారు అని లోకి చెప్పడం తనకు ఆనందాన్ని ఇచ్చిందంటూ చెప్పాడు నాగ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షాకింగ్ కిడ్నాప్ డ్రామా.. అసలు సంగతి తెలిసి పోలీసుల షాక్
వరదల్లో కొట్టుకుపోయిన 20 కోట్ల నగలు.. ఎగబడిన జనం
9 గంటలకు పైగా నిద్రపోతే.. చావు మూడినట్లేనా?
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మిన మహిళ.. అర్థరాత్రి ఊహించని ఘటన
కోహినూర్ ధరిస్తే అరిష్టమా ?? అసలు చరిత్ర ఇదే