రాఖీ పండుగ వస్తోంది. ఈ పవిత్రమైన రోజున అన్నచెల్లెల్లు ప్రేమతో గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల బంధానికి మంచిది కాదని జ్యోతిష్యం, వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రాఖీ పండుగ రోజున మీ చెల్లెలికి ఇవ్వకూడని కొన్ని బహుమతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కంచు, గాజు వస్తువులు
గాజు లేదా కంచుతో చేసిన వస్తువులు చాలా సున్నితంగా త్వరగా పగిలిపోయేవిగా ఉంటాయి. ఇవి బంధాలను బలహీనపరుస్తాయి లేదా తెంచుతాయని అంటారు. అందుకే ఈ వస్తువులను బహుమతిగా ఇవ్వకుండా ఉంటే మంచిది.
గడియారాలు, టైమర్‌లు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గడియారాలు శని గ్రహానికి సంబంధించినవిగా భావిస్తారు. అందు వల్ల గడియారాలను బహుమతిగా ఇవ్వడం వల్ల బంధంలో ఆలస్యం, అడ్డంకులు, దురదృష్టం రావచ్చని నమ్ముతారు.
పదునైన వస్తువులు
కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల బంధంలో అపార్థాలు, గొడవలు రావచ్చని నమ్ముతారు. ఈ రకమైన వస్తువులు బంధాలను విచ్ఛిన్నం చేస్తాయని అంటారు. అందుకే ఈ వస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వకూడదు.
నలుపు రంగు వస్త్రాలు, వస్తువులు
వాస్తు శాస్త్రం ప్రకారం నలుపు రంగు దుఃఖం, చెడు భావాలకు చిహ్నం. అందుకే ఈ రంగు వస్తువులు లేదా బట్టలను ప్రత్యేక సందర్భాల్లో బహుమతిగా ఇవ్వడం మంచిది కాదని చెబుతారు. ఇవి బంధంలో నెగటివ్ ఎనర్జీని పెంచవచ్చని నమ్ముతారు.
(Note: ఈ సమాచారం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. ఇది పూర్తిగా శాస్త్రీయంగా నిరూపించబడినది కాదు. ఈ విషయాలను నమ్మాలా వద్దా అనేది మీ వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది)