కొంత మంది సినిమాలు తక్కువ చేసినా, తన గ్లామర్‌తో మాత్రం మంచి పాపులారిటీ సంపాదించుకుంటారు. అందులో ముందుంటుంది తెలుగు బ్యూటీ ఐశ్వర్యా మీనన్. తాజాగా ఈ అమ్మడు సెల్ఫీ ఫొటోల్లో అందంగా కనిపిస్తూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. సింపుల్ డ్రెస్‌లో అదిరిపోయే లుక్‌లో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఐశ్వర్యా మీనన్ తమిళంలో వరసగా సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత ఈ చిన్నది నిఖిల్ స్పై మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా హిట్ అందుకోకపోవడంతో ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదని చెప్పాలి.
అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా అవకాశాలు కూడా రాలేదు. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ కార్తికేయ సరసన భజే వాయు వేగం సినిమాలో నటించి మెప్పించింది. కానీ ఈ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది.
దీంతో ఈ నటి తెలుగులో ఎక్కువ సినిమాల్లో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక మూవీస్ లేకపోయినా ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు అందాలు చూస్తే మతి పోవాల్సిందే. సెల్ఫీలో తన క్యూట్ నెస్‌తో అందరినీ ఆకట్టుకుంది. అందులో ఈ బ్యూటీని చూసి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.