మహావతార్ నరసింహా… ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ కొల్లగొడుతున్న యానిమేషన్ సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీకి భారీ రెస్పాన్స్ వస్తుంది. మహా విష్ణువు అవతారమైన నరసింహా ఆధారంగా కన్నడలో రూపొందించిన ఈ మూవీని తెలుగుతోపాటు పలు భాషలలో విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ వస్తుంది. మొదటి రోజు కేవలం రూ.1.75 కోట్లు రాబట్టిన ఈ మూవీ.. పది రోజుల్లో ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియనాలోనే కాదు.. అటు విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇవి కూడా చదవండి: Mahesh Babu : కాలేజీలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్..
భక్త ప్రహ్లాదుడి చరిత్ర.. మహా విష్ణువుకు, హిరణ్యకశిపునికి మధ్య యుద్ధం వంటి అంశాలతో రూపొందించిన ఈ యానిమేషన్ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించగా.. రాబోయే రోజుల్లో మహా విష్ణువు పది అవతారాలను రూపొందించనున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలోని మాటలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ప్రదర్శించే థియేటర్లన్నీ ఓం నమో భగవతే వాసుదేవాయ నామ సంకీర్తనతో మార్మోగిపోతున్నాయి.
ఇవి కూడా చదవండి: Tollywood: ఉదయం లేవగానే ముఖానికి ఉమ్మీ రాసుకుంటాను.. స్టార్ హీరోయిన్ బ్యూటీ సీక్రెట్.. ఫ్యాన్స్ షాక్..
ఈ సినిమాలోని మాటలు, పాటలు ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ పాటలు, మాటలు రాసింది ఎవరా అని సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. మహావతార్ నరసింహా సినిమాకు మాటలు, పాటలు రాసింది రాకేందు మౌళి. ప్రముఖ సినీ రచయిత వెన్నెలకంటి చిన్న కుమారుడు. తెలుగులో అనేక చిత్రాలకు మాటలు, పాటలు రాసిన వెన్నెలకంటి వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన రాకేందు మౌళి.. ఇప్పటివరకు పలు చిత్రాలలో నటించారు. సాహసం శ్వాసగా సాగిపో, కిరాక్ పార్టీ, పొలిమేర 2 వంటి చిత్రాల్లో నటించారు. అలాగే మహావతార్ నరసింహా సినిమాకు మాటలు, పాటలు రాశారు.
ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి: Pawan Kalyan: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో గుర్తుపట్టారా.. ?