Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

గుండె తరుక్కుపోయే ఘటన.. శిశువు మృతదేహంతో 100 కిలోమీటర్లు ప్రయాణం.. వీడియో చూస్తే..!

6 August 2025

Ro-Kho: 2027 వన్డే ప్రపంచ కప్ నుంచి రోహిత్, కోహ్లీ ఔట్.. పంతం నెగ్గించుకున్న గంభీర్..?

6 August 2025

Kolhapur Elephant: మాకు అప్పగించాల్సిందే.. ఒక్క ఏనుగు కోసం 30 వేల మంది పాదయాత్ర.. అసలు మ్యాటర్‌ ఏంటంటే..

6 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Macherla Vijayawada 67228 Train Timings Changed,విజయవాడ వెళ్లే ఆ రైలు టైమింగ్స్ మారాయి.. కొత్త షెడ్యూల్ ఇదే, రైలు వేగం కూడా పెంచారు – macherla to vijayawada 67228 memu train timings changed from august 6 2025
ఆంధ్రప్రదేశ్

Macherla Vijayawada 67228 Train Timings Changed,విజయవాడ వెళ్లే ఆ రైలు టైమింగ్స్ మారాయి.. కొత్త షెడ్యూల్ ఇదే, రైలు వేగం కూడా పెంచారు – macherla to vijayawada 67228 memu train timings changed from august 6 2025

.By .6 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Macherla Vijayawada 67228 Train Timings Changed,విజయవాడ వెళ్లే ఆ రైలు టైమింగ్స్ మారాయి.. కొత్త షెడ్యూల్ ఇదే, రైలు వేగం కూడా పెంచారు – macherla to vijayawada 67228 memu train timings changed from august 6 2025
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Macherla Vijayawada 67228 Train Schedule Changed: ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం రైలు వేళల్లో మార్పులు చేశారు అధికారులు. ప్రతి రోజూ మాచర్ల నుంచి విజయవాడ వెళ్లే ప్యాసింజర్ రైలు ఇకపై ఉదయం 5.30 గంటలకు బదులు 6 గంటలకు బయలుదేరుతుంది. అలాగే, చెంగల్పట్టు-కాకినాడ, పుదుచ్చేరి-కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైళ్ల షెడ్యూల్‌లో కూడా మార్పులు చేశారు. తమిళనాడు వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాల సందర్భంగా గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలి.

హైలైట్:

  • ఏపీలో ఆ రైలు టైమింగ్స్ మారాయి
  • అంతేకాదు రైలు వేగాన్ని పెంచారు
  • కొత్త షెడ్యూల్ నేటి నుంచే అమలు
మాచర్ల విజయవాడ 67228 షెడ్యూల్ మార్పు
మాచర్ల విజయవాడ 67228 షెడ్యూల్ మార్పు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో నడిచే ప్యాసింజర్ రైలు వేళల్లో మార్పులు చేశారు. ప్రతి రోజూ మాచర్ల నుంచి విజయవాడ వెళ్లే ప్యాసింజర్ రైలు వేళల్లో మార్పులు చేశారు. గతంలో ఈ రైలు ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకు బయల్దేరేది. నేటి నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్ ప్రకటించారు. ఈ మార్పును ప్రయాణికులు గమనించాలని సూచించారు. మాచర్ల-గుంటూరు మధ్యన ఈ రైలు వేగాన్ని పెంచినట్లు అధికారులు తెలిపారు. మాచర్ల నుంచి విజయవాడ ప్యాసింజర్ ట్రైన్ నెంబర్ 67228 షెడ్యూల్ ఇలా ఉంది. మాచర్లలో ఉదయం 6 గంటలకు మొదలై 8:30 గుంటూరు, 10:55 కు విజయవాడ చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.. ప్రతిరోజూ రైలు ప్రయాణికులు మాచర్ల, గుంటూరు రూట్‌లో ప్రజలకు సానుకూలమైన అంశం.మాచర్ల: 6:00 ఉదయం
రెంటచింతల: 6:20 AM
గురజాల: 6:32 AM
నడికుడి: 6:48 AM
తుమ్మల చెరువు: 7:02 AM
పిడుగురాళ్ల: 7:13 AM
బెల్లంకొండ: 7:20 AM
రెడ్డిగూడెం: 7:27 AM
సత్తెనపల్లి: 7:40 AM
పెదకూరపాడు: 7:52 AM
సిరిపురం: 8:00 AM
బండారుపల్లి: 8:08 AM
నల్లపాడు: 8:18 AM
గుంటూరు: 8:30 AM
పెదకాకాని: 8:39 AM
నంబూరు: 8:52 AM
మంగళగిరి: 9:34 AM
కృష్ణ కెనాల్ జంక్షన్: 9:55 AM
విజయవాడ :10:55 ఉదయం AM

మరోవైపు రెండు రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. అక్టోబరు 2 నుంచి చెంగల్పట్టు-కాకినాడ రైలు (17643/17644) అక్టోబరు 3 నుంచి మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో నడుస్తుంది. పుదుచ్చేరి-కాకినాడ ఎక్స్‌ప్రెస్ (17656) ప్రతి సోమ, గురు, శనివారాల్లో మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (17655) అక్టోబరు 4 నుంచి అదే రోజులలో రానుంది. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలి.

ఆటోలో సీఎం చంద్రబాబు ప్రయాణం..

మరోవైపు తమిళనాడులోని నాగపట్నంలో వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాల సందర్భంగా గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడుపుతున్నారు. ఈ నెల 27, సెప్టెంబరు ఆరో తేదీల్లో రాత్రి 9-40 గంటలకు బాంద్రా టెర్మినల్-వెలంకని ప్రత్యేక రైలు (09093).. బాంద్రా టెర్మినల్‌లో బయలుదేరి రెండో రోజు ఉదయం 7-40 గంటలకు వెలంకనికి చేరుకుంటుంది. ఈ రైలు (09094) తిరుగు ప్రయాణంలో వెలంకనిలో ఈ నెల 30, సెప్టెంబరు 9 తేదీల్లో అర్ధరాత్రి 12-30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం పదిన్నరకు బాంద్రా చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు ఏపీలోని మంత్రాలయం రోడ్‌, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంటలో ఆగుతుంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి