AP Govt Plans GCC Products In Ration Shops: రేషన్ పంపిణీతో పాటుగా రేషన్ కార్డుల విషయంలో ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజన ఉత్పత్తులను రేషన్ షాపుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గిరిజన సహకార సంస్థలతో త్వరలో ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు.ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు అందుతాయన్నారు. గిరిజన ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంటే గిరిజనులు తయారు చేసిన వస్తువులు ఇకపై రేషన్ షాపుల్లో కూడా దొరుకుతాయి.
హైలైట్:
- ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన
- ఇకపై రేషన్ షాపుల్లో గిరిజన ఉత్పత్తులు
- త్వరలోనే ఒప్పందం చేసుకుంటారట

ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ తీసుకుంటున్న వారితో పాటు కొత్తగా మంజూరైన వారికి కూడా స్మార్ట్ కార్డులు ఇస్తామని చెప్పారు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రేషన్ పంపిణీలో నగదు చెల్లింపు విధానం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి డిజిటల్ వ్యాలెట్ విధానం ప్రవేశపెడతామని అన్నారు. దీనివల్ల ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్టు సైజులో ఉంటాయని..కొన్ని మ్యాపింగ్ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. ప్రతి నెలలో 15 రోజులు పాటూ రేషన్ సరుకులు అందిస్తున్నారని..
ప్రతి నెలా 26 నుంచి 30వ తేదీ వరకు 65 సంవత్సరాల వయస్సు దాటిన వృద్ధులకు, వికలాంగులకు ముందుగానే ఇంటివద్దకే సరకులు అందిస్తున్నామన్నారు.
గండికోటను సందర్శించిన సీఎం చంద్రబాబు.. అబ్బో ఇన్ని సమస్యలు ఉన్నాయా!
మరోవైపు ఏపీ ప్రభుత్వం నేతన్నలకు శుభవార్త చెప్పింది. చేనేత రంగానికి సహాయం చేయడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. కార్మికుల కోసం రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేస్తారు. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తారు. కార్మికుల కోసం రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత, జౌళి శాఖపై సమీక్ష నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవం అయిన ఆగస్టు 7 నుంచి కొత్త నిర్ణయాలు అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. వ్యవసాయం తర్వాత చేనేత రంగం చాలా ముఖ్యమైనదన్నారు చంద్రబాబు. ఈ రంగంపై ఆధారపడిన వారికి అండగా నిలవాలన్నారు. ఇటీవల చేనేత ఉత్పత్తులకు 10 జాతీయ అవార్డులు వచ్చాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఒకే జిల్లా-ఒకే ఉత్పత్తి విభాగంలో మొదటిసారి అవార్డు వచ్చిందన్నారు.. సీఎం అధికారులను అభినందించారు.