School Holidays: తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీలగిరి, విరుదునగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు. కోయింబత్తూర్, తేని సహా 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగే పడే అవకాశం ఉందని, దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Varalakshmi Vratham: వరలక్ష్మీ వ్రతం రోజు ఇలా చేస్తే మీకు లక్ష్మీ దేవి కటాక్షం ఉన్నట్లే.. డబ్బే.. డబ్బు..
ఈ రోజు, రేపు తమిళనాడుతో పాటు కేళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. కేరళ, తమిళనాడులోని ఘాట్ ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. IMD ప్రకారం, రాబోయే 3 నుండి 4 రోజుల్లో తమిళనాడు, కేరళ, మాహే, కోస్టల్, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్‌లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కొనసాగుతాయి.
ఇవి కూడా చదవండి
ఈ వాతావరణ పరిస్థితులు నేడు జమ్మూ-కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కూడా ఉంటాయని తెలిపింది. దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలలో, వాయువ్య మధ్యప్రదేశ్, బీహార్, ఉప-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఈరోజు ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది.
ఇది కూడా చదవండి: వామ్మో.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తులం ధర ఎంత పెరిగిందంటే
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు:
ఇదిలా ఉండగా, తెలంగాణలో కూడా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, జనగాం, పెద్దపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మంచిర్యాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
గత 24 గంటల్లో అంటే మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలోని ఏడు మండలాల్లో 6 నుంచి 10 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైందన్నారు. అలాగే మరో 78 మండలాల్లో 2 నుంచి 6 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇది కూడా చదవండి: AP School Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాఠశాలలకు భారీగా సెలవులు.. విద్యార్థులకు పండగే..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి