Andhra Pradesh Haj 2026 Rs 1 Lakh Aid: ఆంధ్రప్రదేశ్‌లో హజ్ యాత్రికులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 2026 హజ్ యాత్రకు దరఖాస్తు గడువు పొడిగించింది. విజయవాడ నుండి వెళ్లే యాత్రికులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది. తాజాగా గతంలో విజయవాడ ఎంబార్కేషన్ రద్దు కావడంతో ఇబ్బంది పడిన వారికి ప్రభుత్వం రూ.72 లక్షలు మంజూరు చేసింది. హజ్ యాత్ర 2026కు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ ఒక్కరోజే ఛాన్స్ ఉంది.
హైలైట్:
- ఏపీలో హజ్ యాత్ర 2026
- ఇవాళ ఒక్కరోజే ఛాన్స్ ఉంది
- రూ.లక్ష అందిస్తున్న సర్కార్

అంతేకాదు ఏపీ నుంచి 2026లో హజ్ యాత్రకు వెళ్లే వారికి కూడా శుభవార్త చెప్పారు. విజయవాడ ఎంబార్కేషన్ ఉంచుకుంటే రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామన్నారు మంత్రి ఎన్ఎండీ ఫరూక్. ఇవాళ సాయంత్రంలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరోవైపు అమరావతి సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. శాఖకు సంబంధించిన ఆస్తుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. మైనార్టీ సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. ఆ శాఖకు అనుబంధంగా ఉన్న వివిధ ఆస్తుల జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. దీని ద్వారా ఆస్తులను సక్రమంగా వినియోగించవచ్చు
రాష్ట్ర హజ్ కమిటీ సీఎం చంద్రబాబును కలిసింది. శాశ్వత హజ్ హౌస్ కట్టడానికి విజయవాడ లేదా గుంటూరు దగ్గర నేషనల్ హైవే పక్కన 5 నుంచి 6 ఎకరాల స్థలం కావాలని కోరారు. సీఆర్‌డీఏ ద్వారా స్థలం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. 2026 హజ్ యాత్ర కోసం విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్ కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
గండికోటను సందర్శించిన సీఎం చంద్రబాబు.. అబ్బో ఇన్ని సమస్యలు ఉన్నాయా!
వారం క్రితం గన్నవరం విమానాశ్రయం ఎంబార్కేషన్ పాయింట్ పునరుద్ధరణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాశారు. దీనికి స్పందిస్తూ విజయవాడను హజ్ ఎంబార్కేషన్ పాయింట్‌గా కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ఇకపై హజ్ యాత్రకు వెళ్ళేవారికి ఎంబార్కేషన్ పాయింట్‌గా ఉంటుంది.