TDP Two Sarpanchs Mptc Win: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కొండపి, కడియపులంక సర్పంచి స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఆ రెండు చోట్ల టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిపల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వేపకారిపల్లి ఎంపీటీసీ.. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు-1 ఎంపీటీసీ.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని మణీంద్రం ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా టీడీపీ అభ్యర్థులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు.
హైలైట్:
- ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు
- రెండు సర్పంచ్‌లు టీడీపీకే
- మూడు ఎంపీటీసీలు కూడా

ఇటు రాజమహేంద్రవరం రూరల్ కడియపులంక సర్పంచ్‌గా మాదిశెట్టి పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు.. అయితే చనిపోయిన సర్పంచ్ అమ్మాణీ కుమార్తె మాదిశెట్టి పద్మావతి నామినేషన్ దాఖలు చేశారు. మరో మహిళల నామినేషన్ దాఖలు చేయగా.. ఆమె చివర్లో నామినేషన్ ఉపసంహరించు కోవడంతో రేసులో ఒకరే ఉండటంతో.. మాదిశెట్టి పద్మావతి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జగన్ మందలించాల్సిందిపోయి ఇలా చేస్తే ఎలా.. చంద్రబాబు
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల.. అలాగే ఒంటిమిట్టలో జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలకు ఈనెల 12న పోలింగ్ ఖాయమైంది. 2021లో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు చోట్ల వైఎస్సార్‌సీపీ గెలిచింది. పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి మరణించడం, ఒంటిమిట్ట జెడ్పీటీసీగా గెలిచిన ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి ఎమ్మెల్యే కావడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. పులివెందుల నుంచి మహేశ్వరరెడ్డి కుమారుడు హేమంత్ కుమార్, టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య లతారెడ్డి పోటీ చేస్తున్నారు. ఒంటిమిట్టలో వైఎస్సార్‌సీపీ నుంచి సుబారెడ్డి, టీడీపీ నుంచి ముద్దుకృష్ణా రెడ్డి పోటీలో ఉన్నారు.