Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Shubman Gill : సెలబ్రిటీ గర్ల్ ఫ్రెండ్, కోట్ల కొద్దీ సంపాదన.. బాగానే కూడబెట్టావయ్యా గిల్.. ఇంతేనా ఇంకేమైనా ఆస్తులున్నాయా ?

6 August 2025

థ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్ట్‌లు.. కేసును పోలీసులు ఎలా ఛేదించారో తెలిస్తే!

6 August 2025

Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?

6 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Banaganapalli Palace,Arundhati Fort: అరుంధతి సినిమాలో కోట ఎక్కడుందో తెలుసా.. పెద్ద చరిత్రే ఉంది, కానీ ఇప్పుడిలా – arundhati movie banaganapalli palace in bad condition
ఆంధ్రప్రదేశ్

Banaganapalli Palace,Arundhati Fort: అరుంధతి సినిమాలో కోట ఎక్కడుందో తెలుసా.. పెద్ద చరిత్రే ఉంది, కానీ ఇప్పుడిలా – arundhati movie banaganapalli palace in bad condition

.By .6 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Banaganapalli Palace,Arundhati Fort: అరుంధతి సినిమాలో కోట ఎక్కడుందో తెలుసా.. పెద్ద చరిత్రే ఉంది, కానీ ఇప్పుడిలా – arundhati movie banaganapalli palace in bad condition
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Arundhati Fort In Risk: నంద్యాల జిల్లాలోని బనగానపల్లె దగ్గర పాతపాడు శివారులో ఒక బంగ్లా ఉంది. అరుంధతి సినిమాలో కనిపించడంతో దీన్ని అందరూ అరుంధతి బంగ్లా అంటున్నారు. ఇక్కడ చాలా సినిమాలు, సీరియల్స్ కూడా తీశారు. కానీ ఇప్పుడు ఈ చారిత్రక ప్రదేశం శిథిలావస్థకు చేరుకుంది. నవాబు వారసులమని చెప్పుకునే వాళ్లు ఇక్కడికి వచ్చే సందర్శకుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. కానీ వారు బంగ్లాను మాత్రం పట్టించుకోవడం లేదు అంటున్నారు.

హైలైట్:

  • అరుంధతి సినిమా కోట పరిస్థితి ఇలా
  • శిథిలావస్థకు చేరిన బనగానపల్లె బంగ్లా
  • వారసులు పట్టించుకోవడం లేదట
అరుంధతి కోట శిథిలావస్థ
అరుంధతి కోట శిథిలావస్థ (ఫోటోలు– Samayam Telugu)

టాలీవుడ్‌లో అరుంధతి సినిమా సూపర్ హిట్ సాధించింది.. అనుష్క నటనకు మంచి పేరు వచ్చింది.. విలన్‌గా సోనూసూద్ కూడా అదరగొట్టాడు. అయితే అరుంధతి సినిమా పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది కోట.. ఈ కట్టడం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని తెలుసా.. అవును నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పాతపాడు శివారులో ఈ కోట ఒక పెద్ద గట్టు మీద ఉంది. ఈ సినిమా షూటింగ్ తర్వాత దీనిని అరుంధతి బంగ్లాగా పేరు వచ్చింది. ఈ కట్టడాన్ని 120 ఏళ్ల క్రితం బనగానపల్లి చివరి నవాబు మీర్‌ఫజల్‌ అలీఖాన్‌ నిర్మించారు. అరుంధతి సినిమా మాత్రమే కాదు.. ఇంకా చాలా సినిమాలు, సీరియల్స్ షూట్ చేస్తున్నారు. ఈ కోటను చూసేందుకు ప్రతి రోజూ పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇక్కడ నవాబు వారసులు సందర్శకుల నుంచి రుసుము వసూలు చేస్తున్నారట. అయితే ఈ బంగ్లా శిథిలావస్థకు చేరుకున్నా సంరక్షణకు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.

బనగానపల్లెలో కోట చరిత్ర

బనగానపల్లెను మొదట మొగలు చక్రవర్తుల సామంతులు పాలించేవారట. ఆ తర్వాత 1724లో హైదరాబాదు నిజాం సామంతులుగా ఫైజ్ వారసులు పరిపాలించారు. హుసేన్ ఆలీ ఖాన్ ప్రభువు అయ్యారు.. ఆయన 1783లో మరణించిన తర్వాత అతడి చిన్న కుమారుడు గులాం మొహ్మద్ అలీ రాజయ్యాడు. బనగానపల్లె సంస్థానం తొలినాళ్లలో బ్రిటీష్ ఇండియాలో భాగంగా ఉండేది. తెలుగు ప్రాంతాల్లో హైదరాబాద్ కాకుండా సంస్థానం హోదా పొందిన ఏకైక ప్రాంతం బనగానపల్లె. 1948లో బనగానపల్లె సంస్థానాన్ని దేశంలో కలిపారు. ఈ కోటలో 9 గదులు, ఒక పెద్ద హాలు, కింద నేలమాళిగ ఉన్నాయి. కర్నూలుకు 80 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంది.

అరుంధతి సినిమా కోసం యూనిట్ అక్కడ ఒక నెల రోజులు మకాం వేశారట.. ఆ కోట దగ్గర సినిమాకు తగిన విధంగా కొన్ని సెట్‌లు వేసుకున్నారట. ఈ సినిమా మొత్తం ఆ కోట చుట్టూనే తిరుగుతుంది. అయితే ఈ కోట గురించి గతంలో స్థానికులకు తప్ప ఎవరికీ తెలిసేది కాదు.. కానీ అరుంధతి సినిమా రిజీలైన తర్వాత ఈ కోట ఫేమస్ అయ్యింది. అప్పటి నుంచి ఈ కోటను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి సందర్శకులు ఇక్కడికి వస్తున్నారట. అందుకే ఆ నవాబు వారసులు సందర్శకుల నుంచి టికెట్లు వసూలు చేస్తున్నారట. కర్నూలు జిల్లా సందర్శనకు వెళ్లినవారు ఈ కోటను కూడా చూసి వస్తారు. ప్రస్తుతం ఆ కోట బాధ్యత మొత్తం నవాబు వారసులదే అంటున్నారు. అయితే ఈ కోట శిథిలావస్థకు చేరిందని.. మరమ్మతులు చేయిస్తే బావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Nandyal Ancient Temple: ఇంటి ముందు భారీ గుంత.. తవ్వి చూస్తే పురాతన ఆలయం

మహిళలు పొరపాటున కూడా ఆ ప్యాకెట్లు కొనొద్దు.. జస్ట్ రూ.6 అనుకోవద్దు, ఆ పౌడర్ చాలా డేంజర్.. పోలీసుల హెచ్చరిక

నంద్యాల: భర్తను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన భార్య?.. సంచలనంగా మారిన కేసు!

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి