ఓటీటలు, థియేటర్లు.. హారర్ సినిమాల విషయానికొస్తే ఫ్యాన్ బేస్ కచ్చితంగా సెపరేటు అని చెప్పాలి. ఈ సినిమా ఒక్క పార్ట్ మాత్రమే కాదు.. దీనికి సీక్వెల్స్ కూడా వచ్చాయి. ఓ పాడుపడిన ఇల్లు, అందులోకి వచ్చిన ఒక కుటుంబం.. వారికీ సాయం చేసేందుకు వచ్చిన ఓ జంట.. ఇక మొదలవుతుంది ఈ హారర్ స్టోరీ.. హారర్ ఫ్యాన్స్‌కు ఈ సినిమాలో ప్రతీ సీన్‌కు గుండెల్లో వణుకు పుడుతుంది. ఈ మూవీకి ఇప్పటిదాకా మొత్తం 8 పార్ట్‌లు విడుదలయ్యాయి. మొత్తం రూ.1817 కోట్ల బడ్జెట్‌తో తీస్తే.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.17,400 కోట్లు వసూళ్లు చేసింది. మరి ఆ సినిమా మరేంటో కాదు.. ‘ది కంజ్యూరింగ్ యూనివర్స్’.
2013లో దీని మొదటి సినిమా విడుదలైంది. డైరెక్టర్ జేమ్స్ వాన్ తీసిన ‘ది కంజ్యూరింగ్’ సినిమాతో ఈ హారర్ యూనివర్స్‌కి పునాది పడింది. అతీంద్రియ శక్తులపై పరిశోధన చేసే ఎడ్, లొరేన్ వారెన్ అనే రియల్ లైఫ్ కపుల్ ఎదుర్కొన్న ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తీశారు. రోడ్ ఐలాండ్‌లో ఓ దుష్టశక్తి బారినపడి నరకం చూస్తున్న ఫ్యామిలీని ఎలా కాపాడరన్నది మిగతా స్టోరీ. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 20 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూ.2650 కోట్లు రాబట్టింది.
ఇక ఆ తర్వాత 2016లో ‘ది కంజ్యూరింగ్ 2’, అలాగే ‘వలాక్’ అనే నన్ దెయ్యం బేస్డ్ మరో రెండు సినిమాలు ‘ది నన్’, ‘ది నన్ 2’ వచ్చాయి. అటు ‘అన్నాబెల్లె’ సిరీస్ సైతం ‘అన్నాబెల్లె’, ‘అన్నాబెల్లె: క్రియేషన్’ ‘అన్నాబెల్లె కమ్స్ హోమ్’ సినిమాలు.. ఇక నెక్స్ట్ ‘ది కంజ్యూరింగ్: ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్’ పేరిట హారర్ సినిమా తెరకెక్కింది. ఇలా ఈ కంజ్యూరింగ్ యూనివర్స్ పెద్దదిగా మారింది. మొత్తంగా రూ.1817 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఫ్రాంచైజీ.. ప్రపంచవ్యాప్తంగా రూ.17,400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. కాగా, దీని సిరీస్ ఎండ్ కార్డు కింద ‘ది కంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్’ 2025 సెప్టెంబర్ 5న విడుదల కానుంది.
ఇది చదవండి: స్టార్ హీరో అయితే నాకేంటి.! లిప్‌లాక్ సీన్ వద్దని తెగేసి చెప్పిన హీరోయిన్.. ఆమె ఎవరంటే.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి