మేషం: ఈ రాశివారు వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవిని పూజించడంతో పాటు ధన వృద్ధిని లక్ష్యంగా చేసుకోవడం మంచిది. గురు, శుక్రుల బలం వల్ల ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో సంపన్నులయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టడం వల్ల యాక్టివిటీ పెరిగి ఆర్థికంగా బలం పుంజుకుంటుంది. ఉద్యోగంలో జీతభత్యాలు ఏ విదంగా ఉన్నా, అదనపు ఆదాయ ప్రయత్నాలకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఆశించిన ధన వృద్ధి లక్ష్యం నెరవేరుతుంది.
వృషభం: ఈ వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవి పూజను ఎంత శ్రద్ధగా జరుపుకుంటే అంత మంచిది. ధన స్థానంలో గురు, శుక్రుల కలయిక వల్ల వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఆ రోజున మదుపులు, పెట్టుబడులకు శ్రీకారం చుట్టడం వల్ల వీరికి తప్పకుండా ఆర్థిక లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ట్రేడింగ్ వంటి అదనపు ఆదాయ మార్గాలను చేపట్టడం మంచిది. ఆదాయాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ వృథా చేసుకోవద్దు. ఎంత పెట్టుబడి పెడితే అంత లాభం.
మిథునం: వరలక్ష్మీ వ్రతం రోజు ఈ రాశివారికి అన్నివిధాలా అనుకూలంగా ఉంది. సమయం వృథా కాకుండా అదనపు ఆదాయ ప్రయత్నాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. గృహ, వాహనాలతో పాటు ఆస్తులు కొనే అవకాశం కూడా ఉంది. ఆ రోజున మదుపులు, పెట్టుబడులను ప్రారంభించడం వల్ల తప్పకుండా ఆర్థిక లాభాలు కలుగుతాయి. లాటరీ టికెట్ కొనడానికి కూడా సమయం శుభకరంగా ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు అపారంగా లాభిస్తాయి.
కన్య: ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తి స్థాయిలో కలిగే అవకాశం ఉంది. ఐశ్వర్యకారకులైన శుక్ర, గురులకు వరలక్ష్మి అనుగ్రహంతో బలం పడుతున్నందువల్ల అతి కొద్ది ప్రయత్నంతో వీరు లక్ష్మీదేవితో పాటు కుబేరుడి కృపకు కూడా పాత్రులయ్యే అవకాశం ఉంది. ఆ రోజున లక్ష్మీదేవికి పూజ చేయడంతో పాటు ధన వృద్ధి మీద దృష్టి పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. ఆ రోజున షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టడం వల్ల అత్యధికంగా కలిసి వస్తుంది.
తుల: వరలక్ష్మి వ్రతం రోజు నుంచి వీరి సంపద పెరగడం ప్రారంభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో వీరు అతి తక్కువ కాలంలో కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. వీరి వృత్తి, వ్యాపారాలు ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఆర్జిస్తాయి. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా అంచనాలకు మించి కలిసి వస్తుంది. సామాన్యుడు సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది. వరలక్ష్మీదేవిని పూజించడంతో పాటు ఏ విధమైన ఆదాయ వృద్ధి ప్రయత్నానికి శ్రీకారం చుట్టినా అత్యధికంగా లాభించే అవకాశం ఉంది.
మకరం: వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజించి అదనపు ఆదాయ మార్గాలకు శ్రీకారం చుట్టడం మంచిది. ఆ రోజున ఈ రాశివారికి భాగ్యాధిపతి, లాభాధిపతి, ధన స్థానాధిపతి బాగా అనుకూలంగా ఉండడం వల్ల తప్పకుండా లక్ష్మీ కటాక్షానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో విపరీత ధన యోగం, అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లోనే కాక షేర్లు, స్పెక్యులేషన్ల వంటి అదనపు ఆదాయ మార్గాల్లోనూ ఆదాయం వృద్ధి చెందుతుంది.