ఏసీ ఆన్‌లో ఉంటే ఎంత ఇంధనం అవసరం?: హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కారులో గంటసేపు ఏసీని ఉపయోగిస్తే, ఇంధన వినియోగం గంటకు 0.2 నుంచి 0.4 లీటర్లు. అదే సమయంలో ఎస్‌యూవీలో ఒక గంట పాటు ఏసీని నడపడానికి గంటకు 0.5 నుండి 0.7 లీటర్ల ఇంధనం ఖర్చవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అలాగే, కారు AC ఎంత ఇంధనాన్ని వినియోగిస్తుంది అనేది ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. కారు చిన్నగా ఉంటే కారు ఇంజిన్ తక్కువ శక్తివంతంగా ఉంటుంది. అప్పుడు AC నడుస్తున్నప్పుడు ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో కారు పరిమాణం పెద్దగా ఉంటే, అంటే మీరు SUVలో AC నడుపుతున్నట్లయితే ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుంది.