Actor Suman Political Entry: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీపై సీనియర్ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పొలిటికల్ ఎంట్రీపై మీడియా ప్రతినిధులకు క్లారిటీ ఇచ్చారు. పొరుగు రాష్ట్రం నుంచి తనకు టికెట్ ఆఫర్ వచ్చిందని.. కానీ తాను అంత ఇంట్రెస్ట్‌గా లేనని చెప్పారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని సంకేతాలు పంపారు. అలాగే ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనపైనా స్పందించారు సుమన్.
హైలైట్:
- ఏపీ రాజకీయాలపై సీనియర్ నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్ ఎంట్రీపై సంకేతాలు
- పొరుగు రాష్ట్రం నుంచి టికెట్ ఇస్తామంటూ ఆఫర్లు కూడా

గతంలో కూడా నటుడు సుమన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజల అదృష్టమని వ్యాఖ్యానించారు. తన పొలిటికల్ రీ-ఎంట్రీ గురించి కూడా స్పష్టత ఇచ్చారు. వాజ్‌పేయి, చంద్రబాబు ఉన్న సమయంలోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. చంద్రబాబు పిలిస్తే రాజకీయాల్లోకి వస్తానన్నారు. ఆయన పరిపాలనా దక్షత, విజన్ ఉన్న నేత అన్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్‌పై సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు
తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు అని చెప్పుకొచ్చారు సుమన్. చంద్రబాబును చూసే సభల్లో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నానని.. ఆయన ఆధ్వర్యంలో అమరావతి త్వరగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇప్పుడు మరోసారి రాజకీయాల్లోకి రావడంపై స్పందించారు. నటుడు సుమన్ గతంలో రాజకీయాల్లో కూడా పనిచేశారు. 1999లో తెలుగు దేశం పార్టీలో చేరి ఎన్నికల్లో ప్రచారం చేశారు.. 2004లో బీజేపీలో చేరారు.. అయితే ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.