Cyber Frauds in the Name of Annadata Sukhibhava Scheme Registration: ఏపీ ప్రభుత్వం ఇటీవల అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ రెండో తేదీన సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధులు విడుదల చేశారు. సుమారుగా 46 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.7000 చొప్పున జమ చేశారు. అలాగే ఈ- కేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ వంటి కారణాలతో రానివారికి ప్రక్రియ పూర్తి చేస్తే డబ్బులు జమ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే అన్నదాత సుఖీభవ పథకం పేరుతో సైబర్ మోసాలకు తెరతీశారు కేటుగాళ్లు. దీనిపై పోలీసులు, అధికారులు రైతులను హెచ్చరిస్తు్న్నారు.

అయితే ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశమే కొంతమంది కేటుగాళ్లకు వరంగా మారింది. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఏపీకే ఫైల్స్ పంపుతూ సైబర్ మోసాలకు తెరలేపారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతులకు ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్తూ.. రైతుల ఫోన్లకు ఏపీకే ఫైళ్లను పంపి.. వాటి ద్వారా బ్యాంక్ అకౌంట్లోని నగదు మాయం చేస్తున్నారు.
ఎలా మోసం చేస్తున్నారంటే..
అన్నదాత సుఖీభవ పథకం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ వాట్సాప్ ద్వారా తొలుత సందేశం పంపిస్తారు. ఆ మెసేజ్‌లో ఏపీకే ఫైళ్లను పంపిస్తున్నారు. వీటిని క్లిక్ చేసి వివరాలను నమోదు చేస్తే మీ అకౌంట్లోకి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడతాయని నమ్మిస్తున్నారు. ఇది కచ్చితంగా చేయాల్సిన పని అని.. లేకపోతే మీకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడవని భయపెడుతున్నారు. దీంతో రైతులు ఏపీకే ఫైళ్లు ఓపెన్ చేయగానే.. అవి మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ అవుతున్నాయి. ఆ తర్వాత మన ప్రమేయం లేకుండానే ఫోక్ హ్యాక్ అయ్యి.. సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. దీంతో సెల్‌ఫోన్లలోని సమాచారం, పాస్‌వర్డులు వారికి తెలిసిపోయి బ్యాంక్ ఖాతాల్లోని నగదు కాజేస్తున్నారు.
జగన్ మందలించాల్సిందిపోయి ఇలా చేస్తే ఎలా.. చంద్రబాబు
ఈ నేపథ్యంలో అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏమైనా సందేహాలు, అనుమానాలు ఉంటే నేరుగా సచివాలయం లేదా రైతు సేవా కేంద్రాలు, లేదా సదరు అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులు పంపించే ఏపీకే ఫైళ్లన ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. అలాగే మొబైల్ ఫోన్ సెట్టింగ్‌లలో Install from Unknown Sources ఆప్షన్ డిజేబుల్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.