ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో రేవంత్ రెడ్డి ఫోటోతో అటెండెన్స్ వేసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. విధులకు హాజరు కాకుండానే యాప్‌లో రేవంత్ రెడ్డి ఫోటో అప్లోడ్ చేస్తున్నాడు పంచాయతీ కార్యదర్శి. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందయ్య పల్లి గ్రామంలో జరిగిందీ ఘటన. పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న టి.రాజన్న విధులకు హాజరు కాకుండానే రేవంత్‌రెడ్డి ఫోటో పెట్టి అటెండెన్స్ వేసుకుంటున్నట్లు వెలుగు చూసింది. పంచాయతీ కార్యదర్శుల హాజరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా విధులు నిర్వహిస్తున్న గ్రామాల నుండే అటెండెన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పని ప్రదేశం నుంచే స్పాట్‌లోనే మొబైల్ యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకోవాలి. అయితే కొంత మంది రోజూ ఒకే ఫోటో పెట్టడంతో అనుమానం వచ్చి తనిఖీలు చేపట్టారు అధికారులు. ఈ తనిఖీల్లో పంచాయతీ కార్యదర్శి చేసిన నిర్వాకం చూసి అధికారులు షాక్ అయ్యారు. సదరు కార్యదర్శిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. తనిఖీల్లో మరికొందరి కార్యదర్శుల వ్యవహారం చూసి అధికారులు నివ్వెర పోయారు. కొందరు విధులకు వెళ్లకుండా ఇతరుల సహాయంతో తాము లేకుండానే అటెండెన్స్ నమోదు చేసుకోగా, మరికొందరు ఖాళీ కుర్చీల ఫోటోలు పెట్టి అటెండెన్స్ నమోదు చేసుకుంటున్నట్లు గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమతో కూతురును చూడ్డానికి వెళితే.. మెడలో ఉన్నది కాస్తా కొట్టేశారు
చిన్నారి చేతిరాత బాగోలేదని.. ట్యూషన్ టీచర్ దారుణం..
పడగ విప్పిన పాముతో డాన్స్ ఏంట్రా అయ్యా.. ఆలా చేస్తే ఇలానే అవుతుంది మరి
ముచ్చటగా 8 పెళ్లిళ్లు.. తొమ్మిదో పెళ్లికి సిద్ధమైన మహిళకు ఊహించని షాక్
30 ఏళ్లనాటి పిండం.. ఇప్పుడు శిశువుగా జననం