Andhra Pradesh Cabinet Decisions: రాఖీ పౌర్ణమి వేళ రాష్ట్రంలోని మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూ్స్ చెప్పింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని నిర్ణయించింది. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలనే ప్రతిపాదనలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. స్త్రీ శక్తి పేరుతో ఈ పథకం అమలు చేయనున్నారు. ఆగస్ట్ 9న సీఎం చంద్రబాబు దీనిపై ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.

మరోవైపు ఏపీలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా.. అరకు, భవానీ ద్వీపంలో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వివరించారు. ఏపీ బీడీసీఎల్ రూ.900 కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం హామీగా ఉండాలనే ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లు వెల్లడించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్తానం (టీటీడీ)కి చెందిన 25 ఎకరాల భూమిని వైష్ణవి ఇన్‌ఫ్రా కంపెనీకి ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి వివరించారు. నాయీ బ్రాహ్మణులు, మత్స్యకారులకు గౌరవ వేతనం పెంచినట్లు తెలిపిన మంత్రి పార్థసారథి.. 40వేల సెలూన్ షాపులకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా కరెంట్ ఇస్తున్నట్లు వివరించారు.
టికెట్ తీసుకోమంటే.. చంద్రబాబు వీడియో చూపించారు.. ఇదేందమ్మా?
మరోవైపు రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని నిర్ణయించింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉచిత బస్సు పథకాన్ని మహిళలకు బహుమతిగా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. రాఖీ పౌర్ణమి రోజున దీనిపై చంద్రబాబు ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇక మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. జిల్లాల పునర్విభజనలో లోపాలు, సరిహద్దుల సమస్యలపై చర్చించినట్లు సమాచారం. వీటిని సరిదిద్దాలని.. నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. ఏపీలో జనగణన ప్రారంభమయ్యేలోపు ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది.