ఉత్తరాఖండ్ పర్వతాలలో వర్షాకాలం భయానకంగా మారింది. అనేక జిల్లాలు వర్షబీభత్సంతో చితికిపోయాయి. భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లింది. హిమాచల్‌లో ఎటువంటి నష్టం జరగని ప్రాంతం చాలా తక్కువగా ఉంది. ఎత్తైన కొండలు, పర్వతాలు క్షణాల్లో కూలిపోతున్నాయి. నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి… కిన్నౌర్ మారుమూల జిల్లాలోని రిబ్బాలోని హోల్దాంగ్ ఖాడ్‌లో అకస్మాత్తుగా వరద వచ్చింది. ఈ సమయంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న ఒక బస్సు, కారు వరద నుండి తృటిలో తప్పించుకున్నాయి..
వీడియో ఇక్కడ చూడండి..
హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలోని రిబ్బా గ్రామంలో బుధవారం ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు పెనుప్రమాదం నుంచి తప్పించుకుంది. ఒక కల్వర్టు గుండా బస్సు వెళ్ళింది. బస్సు వెళ్లిన కొన్ని సెకన్లలోనే, క్లౌడ్ బరస్ట్ వల్ల పర్వతం నుండి శిథిలాల వరద మెరుపు వేగంతో లోయలోకి దూసుకొచ్చింది. దీంతో కింద ఉన్న కల్వర్టు, రోడ్డు అన్నీ ధ్వంసమయ్యాయి. ఈ విపత్తు నుంచి బస్సు ప్రయాణికులు కొన్ని సెకన్ల వ్యవధిలో తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
ఇదిలా ఉంటే, ఉత్తరాఖండ్‌కు మరోసారి భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది. చమోలీ జిల్లాకు రెడ్ అలర్ట్, హరిద్వార్‌కు ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది. మొత్తం 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…