తన విలువైన వస్తువులు పోవడాన్ని ఊర్వశి గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు ద్వారా తెలియజేశారు. ఈ ఘటనపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, విమానాశ్రయ సిబ్బంది నుంచి తగిన సహకారం అందలేదని వాపోయారు. గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్ వర్గాల నుంచి ఇప్పటివరకు స్పందన లేదన్నారు. కాగా, ఊర్వశి రౌతేలాకు ఇంతకుముందు కూడా ఇలాంటి కొన్ని ఘటనలు ఎదురయ్యాయి. 2023లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలో రూ. 45 లక్షల విలువైన వస్తువులు పోగొట్టుకున్నారు. అలాగే గతంలో ఆమె ఐఫోన్ కూడా చోరీకి గురైనట్లు ఆమె స్వయంగా వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం :