Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

James Cameron: అవతార్ దర్శకుడి క్రేజీ ప్రాజెక్టు.. టైటానిక్ తరహాలో మరో రియల్ స్టోరీ.. 80 ఏళ్ల నాటి ఘటన ఆధారంగా..

7 August 2025

అమ్మబాబోయ్..! రంగం సినిమా బ్యూటీ ఎంత మారిపోయింది..! ఇప్పుడు ఎలా ఉందంటే

7 August 2025

ఇదెక్కడి మాస్‌ రా మావా.. హెల్మెట్‌కు బదులు పాలక్యాన్‌ మూత.. కట్‌చేస్తే.. బంక్‌ సీజ్‌! ఎందుకో తెలుసా!

7 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Schools 3 Days Holidays,ఏపీలో విద్యార్థులకు పండగే.. వరుసగా 3 రోజులు సెలవులు, లిస్ట్ ఇదే.. ఫుల్ ఎంజాయ్ – august 8th to 10th 3 consecutive holidays for students in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Schools 3 Days Holidays,ఏపీలో విద్యార్థులకు పండగే.. వరుసగా 3 రోజులు సెలవులు, లిస్ట్ ఇదే.. ఫుల్ ఎంజాయ్ – august 8th to 10th 3 consecutive holidays for students in andhra pradesh

.By .7 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Schools 3 Days Holidays,ఏపీలో విద్యార్థులకు పండగే.. వరుసగా 3 రోజులు సెలవులు, లిస్ట్ ఇదే.. ఫుల్ ఎంజాయ్ – august 8th to 10th 3 consecutive holidays for students in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Schools Holidays August 8th 9th 10th: ఏపీలో విద్యార్థులకు ఒక శుభవార్త.. ఆగస్టు 8 నుంచి 10 వరకు స్కూళ్లకు, విద్యా సంస్థలకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 8న శ్రావణ శుక్రవారం, 9న రాఖీ పౌర్ణమి, రెండో శనివారం, 10న ఆదివారం కావడంతో సెలవులు వచ్చాయి. ఈ నెలలో మొత్తం 10 రోజుల పాటూ సెలవులు వచ్చాయి.. వచ్చే వారం కూడా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.

ఏపీలో ఆగస్టులో వరుస సెలవులు
ఏపీలో ఆగస్టులో వరుస సెలవులు (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు పండగే.. మూడు రోజులు వరుసగా సెలవులు వచ్చాయి. మూడ్రోజులు స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు మూతపడతాయి.. ఆగస్ట్ 8వ తేదీ వరలక్ష్మి వ్రతం, ఆగస్ట్ 9న రాఖీ పౌర్ణమితో పాటుగా రెండో శనివారం వచ్చింది. అలాగే ఆగస్ట్ 10వ తేదీ ఆదివారం వచ్చింది.. ఇలా మూడు రోజులు వరుసగా సెలవులు ఉన్నాయి. వరుసగా స్కూళ్లకు సెలవులు రావడంతో రైళ్లు, బస్సుల్లో రద్దీ కనిపిస్తోంది.. రాఖీ పండగ ప్రభావం కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలో దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు రిజర్వేషన్లు లిస్ట్ పెరిగింది.

మరోవైపు ఆ తర్వాత వారమే వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.. ఆగస్ట్ 15వ తేదీ (శుక్రవారం) స్వాతంత్ర దినోత్సవం కాగా.. ఆ రోజు సెలవు. ఆగస్ట్ 16వ తేదీ శ్రీకృష్ణాష్టమి (శనివారం) సెలవు వచ్చింది. ఆగస్ట్ 17వ తేదీ (ఆదివారం) మరో సెలవు వచ్చింది. ఈ వారం మాత్రమే కాదు వచ్చే వారంలో కూడా శుక్ర, శని, ఆదివారాలు వరుసగా సెలవులు ఉన్నాయి. ఈ నెలలో మొత్తం 10 రోజులు సెలవులు వచ్చాయి. వీటిలో రెండు వారాలు వరుసగా మూడు రోజుల చొప్పున సెలువులు ఉండటం విశేషం. ఆగస్టు నెలలో సెలవు దినాలు ఇలా ఉన్నాయి.

03-08-2025 ఆదివారం
08-08-2025 వరలక్ష్మీ వ్రతం
09-08-2025 రాఖీ పండగ, రెండవ శనివారం
10-08-2025 ఆదివారం
15-08-2025 స్వాతంత్ర్య దినోత్సవం
16-08-2025 శ్రీకృష్ణాష్టమి
17-08-2025 ఆదివారం
24-08-2025 ఆదివారం
27-08-2025 వినాయక చవితి
31-08-2025 ఆదివారం

ఆటోలో సీఎం చంద్రబాబు ప్రయాణం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి సెలవుల జాబితాను విడుదల చేసింది. వచ్చే ఏడాది మొత్తం 44 రోజులు సెలవులు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఇందులో సాధారణ సెలవులు 23, ఆప్షనల్ హాలిడేస్ 21 ఉన్నాయి. ఈ సెలవుల వివరాలు జీవోలో పేర్కొన్నారు. సాధారణ సెలవులు 23 రోజులు, ఆప్షనల్ సెలవులు 21 రోజులు ఉన్నాయి. సెప్టెంబర్ నుండి డిసెంబర్ 2025 వరకు సెలవుల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 5న ఈద్ మిలాదున్ నబీ (శుక్రవారం) సెలవు. సెప్టెంబర్ 30న దుర్గాష్టమి (మంగళవారం) వస్తుంది. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి, విజయ దశమి (గురువారం) ఒకే రోజున ఉన్నాయి. దీపావళి అక్టోబర్ 20న (సోమవారం) జరుపుకుంటారు. డిసెంబర్ 25న క్రిస్మస్ (గురువారం) సెలవు ఉంటుంది. కొన్ని ఆప్షనల్ సెలవులు ఉన్నాయి.. సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్య, అక్టోబర్ 9న యాజ్ దహుమ్ షరీఫ్, నవంబర్ 11న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 24న క్రిస్మస్, డిసెంబర్ 26న బాక్సింగ్ డే సెలవులు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి