Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Health Tips: ఈ ఒక్క చిట్కాతో మీ పసుపు దంతాలకు చెప్పండి గుడ్‌బై.. ఇక మెరిసే దంతాలు మీ సొంతం!

9 August 2025

Pawan Kalyan Rakhi Pournami Gift,రాఖీ పండగ వేళ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. ఆ మహిళలు అందరికీ కానుకలు.. – ap deputy cm pawan kalyan gift saree to widow in pithapuram on the occasion of rakhi pournami

9 August 2025

Watch Video: తమ్ముడికి రాఖీ కట్టేందుకు అక్క సాహసం!.. ప్రమాదమని తెలిసి కూడా..

9 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kumki Elephants Food Menu In Andhra Pradesh,కుంకీ ఏనుగుల ఫుడ్ మెనూ ఇదే.. రోజుకు ఎంత ఖర్చవుతుందో తెలుసా.. వామ్మో రోజులో అన్ని గంటల పాటూ తింటాయా? – kumki elephants daily food menu in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Kumki Elephants Food Menu In Andhra Pradesh,కుంకీ ఏనుగుల ఫుడ్ మెనూ ఇదే.. రోజుకు ఎంత ఖర్చవుతుందో తెలుసా.. వామ్మో రోజులో అన్ని గంటల పాటూ తింటాయా? – kumki elephants daily food menu in andhra pradesh

.By .7 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kumki Elephants Food Menu In Andhra Pradesh,కుంకీ ఏనుగుల ఫుడ్ మెనూ ఇదే.. రోజుకు ఎంత ఖర్చవుతుందో తెలుసా.. వామ్మో రోజులో అన్ని గంటల పాటూ తింటాయా? – kumki elephants daily food menu in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Kumki Elephants Food Menu: ఏపీలోని పలు జిల్లాల్లో ఏనుగుల గుంపులు పంటలను నాశనం చేస్తుండటంతో, వాటిని అడవిలోకి తరిమికొట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులతో తొలి ఆపరేషన్ విజయవంతమైంది. తదుపరి ఆపరేషన్ కుంకీని పుంగనూరు అటవీ ప్రాంతంలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కుంకీ ఏనుగుల ఫుడ్ మెనూ ఎలా ఉంది.. ప్రతి రోజూ కొన్ని గంటల పాటూ ఆ ఏనుగులు తినే పనిలోనే ఉంటాయట..

హైలైట్:

  • కర్ణాటక నుంచి వచ్చిన కుంకీలు
  • రోజువారీ ఫుడ్ మెనూ ఇలా ఉంది
  • రోజుకు ఎంత ఖర్చవుతుందో తెలుసా
ఏపీ కుంకీ ఏనుగుల ఫుడ్ మెనూ
ఏపీ కుంకీ ఏనుగుల ఫుడ్ మెనూ (ఫోటోలు– Samayam Telugu)

ఏపీలో ఏనుగుల గుంపులు పలు జిల్లాల్లో పంటల్ని నాశనం చేస్తున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలో ఈ ఏనుగుల్ని అడవిలోకి తరిమికొట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కర్ణాటక నుంచి తీసుకొచ్చిన వాటిలో రంజన్, కృష్ణ, దేవ, అభిమన్యు అనే నాలుగు కుంకీలు ఉన్నాయి. ఏపీకి చెందిన వినాయక్, జయంత్‌లు ఉన్నాయి. వీటిని చిత్తూరు జిల్లాలోని ముసలిమడుగు ఏనుగుల శిబిరంలో ఉంచారు. కుంకీల ఆహారం, ఫుడ్ మెనూ, రోజువారీ దినచర్య గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి.పలమనేరు అటవీ ప్రాంతంలో కుంకీ ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి ఏనుగుకు రోజుకు దాదాపు రూ.3000 ఖర్చు చేస్తున్నారు. వాటి ఆహారం కోసం 50 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వాటి ఆహారపు అలవాట్లు, శిక్షణ వివరాలు ఇలా ఉన్నాయి. కుంకీ ఏనుగులకు ఉదయం 6 గంటలకు 350 గ్రాముల బెల్లం ఇస్తారు. ఉదయం 7 గంటలకు వరి కంకులు అందిస్తారు. అనంతరం 8.30 గంటలకు వాటికి శిక్షణ మొదలవుతుంది. శిక్షకుడు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటూనే పచ్చగడ్డి, రావి, జువ్వి, అత్తి, మర్రి, అరటి బోదెలు (మొత్తం 50 కిలోలు) తింటాయి. ఉదయం 9 గంటలకు నీళ్లు తాగుతాయి.. ఆ తర్వాత 10 గంటలకు రాగి ముద్దలు పెడతారు.

ఆ తర్వాత సాయంత్రం 4 గంటల వరకు అడవిలో నడక ఉంటుంది.. ఆ సమయంలో మేత కూడా ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు వాటికి స్నానం చేయిస్తారు.. సాయంత్రం 5.30 గంటలకు రాగి ముద్దలు తినిపించి నీళ్లు తాగిస్తారు. రాత్రి 6.30 నుంచి 12 గంటల వరకు వరి కంకులు, రావి ఆకులు, అరటి బోదెలు, గడ్డి తింటూ నిద్రపోతాయి. ఒక్కో ఏనుగు రోజుకు 17 నుంచి 18 గంటలు తింటూనే ఉంటుంది. మొత్తం 30మంది సిబ్బంది ఈ శిబిరంలో కుంకీలను పర్యవేక్షిస్తున్నారు.. శిక్షణకు సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్నారు.

మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ఫలించాయి.. కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్‌ విజయవంతమైంది. పంటల్ని ధ్వంసం చేస్తున్న ఏనుగులను కుంకీలు దారిమళ్లించాయని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ తెలిపారు. తొలి ఆపరేషన్‌ను విజయవంతం చేసిన అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. చిత్తూరు జిల్లాలో అటవీ శాఖ అధికారులు ‘ఆపరేషన్ కుంకీ’ ప్రారంభించారు. బంగారుపాళ్యం మండలంలోని మొగిలి దగ్గర ఏనుగుల గుంపు మామిడి తోటలను నాశనం చేస్తుండటంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. కుంకీ ఏనుగుల సహాయంతో అటవీ శాఖ అధికారులు ఏనుగులను అడవిలోకి తరిమికొట్టారు. కృష్ణ, జయంత్, వినాయక అనే కుంకీ ఏనుగులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. మొగిలి ప్రాంతంలో 15 రోజులుగా ఏనుగులు తిరుగుతున్నాయని సమాచారం అందింది. దీంతో అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించారు. శనివారం రాత్రి మొదలైన ఈ ఆపరేషన్ ఆదివారం ఉదయం వరకు కొనసాగింది.

AP Kumki Elephants: పలమనేరుకు చేరుకున్న కుంకీ ఏనుగులు

కర్ణాటక నుండి తెప్పించిన ఈ కుంకీ ఏనుగులతో చేపట్టిన మొదటి ఆపరేషన్ విజయవంతం కావడం సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. సరిహద్దు ప్రాంత ప్రజలకు, రైతులకు ఈ ఆపరేషన్ భరోసా ఇస్తుందని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఏనుగుల నుండి ప్రజలను, పంటలను కాపాడేందుకు కృషి చేస్తోందని, ఇది అందులో మొదటి అడుగు అని ఆయన పేర్కొన్నారు. రెండు నెలల శిక్షణ తర్వాత ఈ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఏనుగుల సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం ఈ ఆపరేషన్ ఉపయోగపడుతుంది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న అటవీ అధికారులకు, మావటిలకు, కావడిలకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. కుంకీ ఏనుగులను ఇచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు, ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి ఆపరేషన్ పుంగనూరు అటవీ ప్రాంతంలో చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి