AP Govt Rs 1 Lakh Deposited In Haj Pilgrims Accounts: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో కీలకమైన హామీని ప్రభుత్వం నెరవేర్చింది. ఈ మేరకు ఒక్కో బ్యాంక్ అకౌంట్‌లో లక్ష రూపాయల చొప్పున జమ చేసింది. ఈ మేరకు విజయవాడ ఎంబార్కేషన్ ఎంచుకున్న 72 మంది హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయం అందింది. 2025లో యాత్రికులు తక్కువగా ఉండటంతో రద్దయిన ఎంబార్కేషన్ పాయింట్‌ను సీఎం చంద్రబాబు చొరవతో కేంద్రం పునరుద్ధరించింది. మక్కాకు వెళ్లే యాత్రికులకు అదనపు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయం చేస్తోంది.
హైలైట్:
- ఏపీ ప్రభుత్వం హామీ నిలబెట్టుకుంది
- వారందరికి రూ.లక్ష చొప్పున జమ
- 2026లో కూడా డబ్బులు ఇస్తారు

అయితే విజయవాడ నుంచి మక్కా వెళ్లే ముస్లిం యాత్రికులకు అదనంగా రూ.70 వేలు ఖర్చు అవుతోంది. ఈ క్రమంలో ఆ ఆర్థికసాయాన్ని ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఏపీ ప్రభుత్వం భరిస్తోంది. ఈ మేరకు మక్కాకు వెళ్లే యాత్రికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విజయవాడ నుంచే హజ్ యాత్రకు వెళ్లేందుకు ప్రయత్నించాలని.. రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ హసన్ బాషా సూచించారు. ఏపీ ప్రభుత్వం 72మందికి మంగళవారం నిధుల్ని విడుదల చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. మరుసటి రోజైన బుధవారం డబ్బులు వారి అకౌంట్‌లలో జమ చేశారు. అంతేకాదు హజ్-2026 యాత్రకు సంబంధించి.. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి వెళ్లే యాత్రికులకు కూడా ఒక్కొక్కరికి రూ.లక్ష సాయం అందిస్తామని ఏపీ మంత్రి ఫరూక్ తెలిపారు. ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారు మొదటి ప్రాధాన్యంగా విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఎంచుకోవాలని సూచించారు.
పచ్చని పొలాల మధ్య.. మంచం మీద కూర్చుని.. రైతులతో మాట్లాడిన చంద్రబాబు
గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేశారు.. దేశవ్యాప్తంగా మొత్తంగా 17 అంతర్జాతీయ విమానశ్రయాల్లో ఎంబార్కేషన్ పాయింట్లు ఉన్నాయి. విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేయడంతో హజ్‌యాత్ర చేసే ముస్లింలకు ఉపయోగం కలుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటుపై కేంద్రానికి లేఖ రాశారు.. దీంతో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌ను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఇకపై హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు. మరోవైపు హజ్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది. విజయవాడ లేదా గుంటూరు దగ్గరలో శాశ్వత హజ్ హౌస్ నిర్మాణం కోస స్థలం కేటాయించాలని కోరారు. అలాగే హజ్ యాత్ర-2026 కోసం విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.