రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో ఆగస్ట్ 1వ లేదీని నుంచి నోపెట్రోల్, నో హెల్మెట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు అమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఒక వాహనదారులు చేసిన పని ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. బైక్ పెట్రోల్ పోసుకోవడానికి వచ్చిన ఒక వాహనదారులు తన దగ్గర హెల్మెట్ లేకపోవడంతో.. తన పాలక్యాన్ మూతను తీసుకొని హెల్మెట్‌లా నెత్తిపై పెట్టుకున్నాడు.
అలాగే పెట్రోల్ బంక్‌లోకి వెళ్లాడు. అయితే అతని నెత్తిపై ఉన్నది పాలక్యాన్ మూత అని గమనించకుండా సదరు పెట్రోల్ బంక్ సిబ్బంది అతనికి పెట్రోల్ పోసి పంపించేశారు. అయితే ఇక్కడే ఉన్న కొందరు ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారి ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. ఈ వైరల్ వీడియోపై స్పందించిన అధికారులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి హెల్మెట్‌లేని వాహనదారుడికి పెట్రోల్ పోసినందుకు సదరు పెట్రోల్ బంక్‌పై చర్యలు తీసుకున్నారు. ఆ పెట్రోల్ బంక్‌ను కొన్ని రోజుల పాటు సీజ్ చేశారు.
కాగా ఈ నెల ఒకటవ లేదీ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో .. ఈ నో హెల్మెట్, నో పెట్రోల్ విధానం అమల్లోకి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా హెల్మెట్‌లేని వాహనదారులకు పెట్రోల్ బంక్‌లలో ఇంధనం పోసేందుకు నిర్వహాకులు నిరాకరిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలు పాటించని పెట్రోల్ బంక్‌లు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఏడాది జలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తున్నారు.
వీడియో చూడండి..
इंदौर में दूधवाले ने हेलमेट की जगह पहना मिल्क टंकी का ढक्कन, वीडियो वायरल होने के बाद पेट्रोल पंप सील @NavbharatTimes #NBTMP #IndoreVideo pic.twitter.com/vM4iu1yGiQ
— NBTMadhyapradesh (@NBTMP) August 6, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.