Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood : రచ్చ లేపిన రుక్సార్ ధిల్లన్.. ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

9 August 2025

Hyderabad: రాఖీ అనుబంధానికి కొత్త అర్థం చెప్పిన ట్రాఫిక్‌ పోలీసులు.. రాఖీలతో రోడ్లపైకి వచ్చి..

9 August 2025

Credit Card: టాప్‌ 5 లైఫ్‌ లాంగ్‌ ఫ్రీ క్రెడిట్‌ కార్డులు..! సరిగ్గా వాడితే ఎన్నో ఉపయోగాలు..

9 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Ckpc Properties Rs 1 Crore Donation,తిరుమల శ్రీవారి బెంగళూరు భక్తుడిది ఎంత పెద్ద మనసు.. ఏపీ మంత్రితో కలిసి భక్తుల కోసం, పూర్తిగా ఉచితం – tirumala devotee ckpc properties md chirag purushottam donated rs 1 crore to ttd sri venkateswara pranadana trust
ఆంధ్రప్రదేశ్

Tirumala Ckpc Properties Rs 1 Crore Donation,తిరుమల శ్రీవారి బెంగళూరు భక్తుడిది ఎంత పెద్ద మనసు.. ఏపీ మంత్రితో కలిసి భక్తుల కోసం, పూర్తిగా ఉచితం – tirumala devotee ckpc properties md chirag purushottam donated rs 1 crore to ttd sri venkateswara pranadana trust

.By .7 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Ckpc Properties Rs 1 Crore Donation,తిరుమల శ్రీవారి బెంగళూరు భక్తుడిది ఎంత పెద్ద మనసు.. ఏపీ మంత్రితో కలిసి భక్తుల కోసం, పూర్తిగా ఉచితం – tirumala devotee ckpc properties md chirag purushottam donated rs 1 crore to ttd sri venkateswara pranadana trust
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala Devotee Rs 1 Crore Donation: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు టీటీడీ ట్రస్టులకు భారీ విరాళాలు అందిస్తున్నారు. తాజాగా భక్తులు, పేదవారి ప్రాణాలు నిలబెట్టే ట్రస్ట్‌కు బెంగుళూరుకు చెందిన చిరాగ్ పురుషోత్తం కోటి రూపాయల విరాళం అందజేశారు. ఏపీ మంత్రితో కలిసి విరాళాన్ని అందించారు. అలాగే టీడీ ఛైర్మన్ ఎస్పీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలను పరిశీలించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అలాగే తిరుమలలో పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి.

హైలైట్:

  • తిరుమల శ్రీవారికి మరో భక్తుడి భారీ విరాళం
  • భక్తులు, పేదల ప్రాణాలు నిలబెట్టేందుకు
  • ఏపీ మంత్రితో కలిసి చెక్కును అందజేశారు
రుమల శ్రీవారికి సీకీపీసీ రూ.కోటి విరాళం
రుమల శ్రీవారికి సీకీపీసీ రూ.కోటి విరాళం (ఫోటోలు– Samayam Telugu)

తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌కు రూ. కోటి విరాళాన్ని బెంగళూరుకు చెందిన CKPC Properties ఎండీ చిరాగ్ పురుషోత్తం ఇచ్చారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ నాయుడుకు ఈ విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. పేద ప్రజలకు ఉచితంగా మెదడు, గుండె, మూత్రపిండాల శస్త్ర చికిత్సలు అందించే ప్రాణదానం ట్రస్ట్ సేవా దృక్పథానికి ఇది గొప్ప తోడ్పాటు అన్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. CKPC Properties ఎండి చిరాగ్ పురుషోత్తం హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. ఇటీవల కాలంలో టీటీడీ ట్రస్టులకు భక్తులు భారీగా విరాళాలను అందజేస్తున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌కు చెందిన భక్తులు విరాళాలను అందించారు.

మరోవైపు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఎస్పీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలలో అత్యవసరమైన పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ‘మహిళా జూనియర్ కళాశాల జేఈవో వీ వీరబ్రహ్మం, టీటీడీ పాలకమండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డితో కలిసి పరిశీలించారు. కాలేజీ పరిసరాలను, వంట గది, హాస్టల్ ప్రాంతాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థినులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. మహిళా జూనియర్ కాలేజీ విద్యార్థినుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. విద్యార్థినులు ప్రాథమిక అవసరాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాలేజీలో సమస్యలను టీటీడీ జేఈవో, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. వాటి అన్నింటిపై నివేదిక తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యార్థినులు చదువుకునేందుకు కళాశాల పరిసరాలు చాలా బాగున్నాయన్నారు. అదేవిధంగా ఈ కళాశాలలో ఉత్తీర్ణత శాతం చాలా అద్భుతంగా ఉందని అభినందించారు. ముఖ్యంగా కళాశాలలో విద్యార్థినులకు హాస్టల్ సామర్థ్యాన్ని, వసతి సౌకర్యాన్ని పెంచాలని, వైద్య సౌకర్యాల పెంపు, వేడి నీటి కోసం సోలార్ వాటర్ హీటర్స్, ఈ – లెర్నింగ్ సెమినార్ హాల్ ఏర్పాటు, హాస్టల్ లో మరమ్మతులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ సౌకర్యం తదితర అంశాలపై అధికారులు నివేదిక తయారు చేసి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు టిటిడి ఛైర్మెన్ సూచించారు’ అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

‘తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధ‌వారం శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వారుకు, వ‌ర‌ద‌రాజ‌స్వామివారికి, వ‌కుళమాత అమ్మ‌వారికి, ఆనంద నిల‌యం, యాగ‌శాల, విష్వ‌క్సేనులవారికి, యోగ‌న‌ర‌సింహ‌స్వామి వారికి, భాష్య‌కార్ల‌కు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బ‌లిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు’ అని తెలిపారు.

తిరుమల శ్రీవారికి ఖరీదైన కానుకలు.. 2.5 కేజీల బంగారంతో

‘అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో జె.శ్యామ‌ల‌రావు, ఆదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు’ అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి