Visakhapatnam Women Caught Playing Poker,విశాఖపట్నంలో పేకాడుతూ దొరికిపోయిన మహిళలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది ఎవరో తెలిస్తే! – police arrested women for playing poker cards in visakhapatnam
Visakhapatnam Women Playing Gambling: విశాఖపట్నంలో లలితానగర్ ఏరియాలో పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ఆరుగుర్ని అదుపులోకి తీసుకుని.. రూ.22 వేలు సీజ్ చేశారు. ఆ మహిళల్లో ఒకరి భర్తే పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఈ ఘటన స్థానికంగా హాట్ చర్చనీయాంశమైంది. వీరు కొంతకాలంగా అక్కడ పేకాడుతున్నట్లు తెలుస్తోంది.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
హైలైట్:
విశాఖపట్నంలో పోలీసుల సోదాలు
పేకాడుతూ దొరికిపోయిన మహిళలు
డబ్బుల్ని స్వాధీనం చేసుకున్నారు
విశాఖపట్నంలో పేకాడుతున్న మహిళలు అరెస్ట్ (ఫోటోలు– Samayam Telugu)
విశాఖపట్నంలో జూదం ఆడుతున్న ఆరుగురు మహిళలను పోలీసులు అరెస్ట్. లలితానగర్ ప్రాంతంలో కొందరు మహిళలు జూదం ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే నాలుగో పట్టణ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కలిసి దాడి చేసి ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి రూ. 22 వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. అయితే ఈ మహిళలు తరచూ వారి ఇళ్లలో పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది.కొంతకాలంగా మహిళలు పేకాట ఆడుతున్నట్లు స్థానికంగా ఉండే ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ పేకాట ఆడుతున్నవాళ్లలో ఓ మహిళ భర్త పోలీసులకు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారట. తన భార్య రోజూ జూదం ఆడుతున్నట్లు పోలీసులకు చెప్పారట. ఆ తర్వాత ఆయనే పోలీస్ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయడంతోనే నాలుగో పట్టణ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి అరెస్ట్ చేశారు. ఈ పేకాట ఎపిసోడ్ స్థానికంగా సంచలనంగా మారింది. ఆడవాళ్లు పేకాట ఆడటం కామన్ అనుకున్నా.. వారిలో ఒకరి భర్త ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది.
విశాఖపట్నంలో కొంతకాలంగా ఈ మహిళలు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. వీరు గత కొంతకాలంగా ఒక బిల్డింగ్‌లో మినీ పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయట. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేకాట ఆడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా ఇదే బిల్డింగ్‌లో పేకాట ఆడుతున్న మహిళలను పోలీసులు హెచ్చరించి వదిలేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా సరదాగా ఇళ్లలో పేకాట ఆడుకుంటారు.. కానీ వీళ్లు డబ్బులతో ఆడుతున్నట్లు తేలింది. ఏపీ పోలీసులు ఇటీవల కాలంలో డ్రోన్ సాయంతో పేకాట రాయుళ్లు, మందుబాబులో ఆటకట్టిస్తున్నారు.. పలు జిల్లాల్లో పోలీసులకు దొరక్కుండా.. ఎక్కడో దూరంగా పొలాల్లో, దూరంగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో పేకాట ఆడుతున్నారు. అయితే పోలీసులు డ్రోన్ అలా పైకి ఎగరేయగానే.. పేకాటరాయుళ్లు ఇలా దొరికిపోతున్నారు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి