Lingala Jaggayyapeta Bridge Opening: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైన కాజ్‌వే పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య చేతుల మీదుగా లింగాల బ్రిడ్జిని ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నారు. మున్నేరు వరదల కారణంగా కాజ్‌వే దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రూ.1.90 కోట్లతో శాశ్వత మరమ్మతులు చేపట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు స్థానికులతో పాటుగా జగ్గయ్యపేటలోని సిమెంటు కంపెనీలకు చాలా కీలకమైనది.
హైలైట్:
- తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన రోడ్డు
- గతేడాది మున్నేరు వరదలతో దెబ్బతింది
- రూ.1.90కోట్లతో మరమ్మతుల పనులు

ఈ సమస్యపై జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య వెంటనే స్పందించారు.. సిమెంటు కంపెనీల యజమానులతో మాట్లాడి.. వారి సహాయంతో ఆ రోడ్డును తాత్కాలికంగా బాగు చేయించారు.. కాకపోతే చిన్న వాహనాలు వెళ్లేలా మాత్రమే ఆ రోడ్డును వేశారు. అయితే ఆ రోడ్డు కొంతకాలానికి మళ్లీ గుంతలమయంగా మారి పాడైపోవడంతో జనాలు మళ్లీ ఇబ్బందిపడ్డారు. అప్పుడు ఈ కాజ్‌వేకు శాశ్వతంగా మరమ్మతులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య రంగంలోకి దిగారు.. ఈ సమస్యకు పరిష్కారం గురించి ఆలోచించారు.
వీడియో: చీపురు పట్టి చెత్త ఊడ్చిన సీఎం చంద్రబాబు
ఆ వెంటనే ఈ రోడ్డుకు శాశ్వతంగా మరమ్మతులు చేయించారు.. ఏకంగా రూ.1.90 కోట్లు మంజూరు చేశారు. జూన్‌లో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించగా.. జులై నెలాఖరుకు పనులు ముగింపు దశకు వచ్చాయి. స్లాబ్ కల్వర్టుల నిర్మాణం కూడా పూర్తి కావడంతో ఇవాళ ప్రారంభిస్తున్నారు. జగ్గయ్యపేట సమీపంలో ఉన్న సిమెంటు పరిశ్రమల ముడిసరకు రవాణాకు ఈ రోడ్డు చాలా కీలకమని చెబుతారు. అంతేకాదు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ముఖ్యమైన రోడ్డు.. ఇంతకాలం వారంతా ఇబ్బందిపడ్డారు.. మొత్తానికి సమస్యను పరిష్కరించడంతో ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ సమీప గ్రామాలతో పాటుగా రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు లైన్ క్లియర్ అయ్యింది.